IND vs BAN: ‘‘ఆప్షన్లు ఎక్కువ ఉండటం మంచిదే.. కానీ ఫైనల్‌ XI ఎంపికే కీలకం’’

సూపర్-8 పోరులో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడేందుకు సిద్ధమైంది. ఆంటిగ్వా వేదికగా మ్యాచ్ జరగనుంది. పిచ్‌ స్పిన్నర్లకు సహకారం లభిస్తుందనేది విశ్లేషకుల అంచనా. అందుకు తగ్గట్టుగానే తుది జట్టులో టీమ్‌ఇండియా మార్పులు చేయనుంది. 

Published : 22 Jun 2024 16:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పొట్టి కప్‌ను నెగ్గాలంటే అన్ని విభాగాలూ బలంగా ఉండాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ (Sanjay Manjrekar) వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం భారత్‌ జట్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఆప్షన్లు ఎక్కువగా ఉన్నాయని.. సరైన తుది జట్టును ఎంపిక చేసుకుంటే కప్‌ను నెగ్గడం పెద్ద కష్టమేం కాదని తెలిపాడు. టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 (ICC Mens T20 World Cup) పోరులో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు. 

‘‘భారత స్క్వాడ్‌లో స్పిన్నర్లు, పేసర్లకు కొదవేం లేదు. ఆప్షన్లు చాలా ఉన్నాయి. పిచ్‌ పరిస్థితిని బట్టి తుది జట్టు ఎంపిక ఉండాలి. ఇదేమీ పెద్ద సమస్య కాదని అనుకుంటున్నా. కానీ, ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరమే. ప్రతి ఒక్కరూ మంచి ఫామ్‌లోనే ఉన్నారనిపిస్తోంది. జట్టులోకి వచ్చే ప్లేయర్‌పై ఒత్తిడి ఉండటం సహజం. తన సత్తా ఏంటో బయటపెట్టాల్సిన అవసరం ఉంది. సరైన ఫైనల్‌ XI టీమ్‌తో బరిలోకి దిగితే ఛాంపియన్‌గా నిలుస్తాం’’ అని మంజ్రేకర్ (Former Cricketer Sanjay Manjrekar) తెలిపాడు. 

బుమ్రాతో జాగ్రత్త.. బంగ్లాకు లారా హెచ్చరిక

భారత జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ప్రభావం చాలా ఎక్కువగా ఉందని.. అతడి విషయంలో బంగ్లా అత్యంత జాగ్రత్తగా ఉండాలని మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా  హెచ్చరించాడు. ‘‘బుమ్రా ప్రపంచస్థాయి (Brian Lara) ఉత్తమ బౌలర్. అతడిని మా జట్టు కోసం ఆడించేందుకు సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే పాస్‌పోర్టు ఇస్తాం. అతడు అంగీకరిస్తే అందుకోసం ఏం చేయడానికైనా రెడీ అని గతంలోనే చెప్పా. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ను ఒక విషయంలో హెచ్చరిస్తున్నా. మీరు భారత్‌పై పట్టు సాధించాలని భావిస్తే మాత్రం బుమ్రాతో పెట్టుకోవద్దు. అతడి జోలికెళ్తే మాత్రం ఓటమిని కొనితెచ్చుకున్నట్లే. ప్రత్యర్థి ఆటగాళ్లు, కెప్టెన్లు ఎవరైనా సరే బుమ్రాతో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. మెక్‌గ్రాత్, ఆంబ్రోస్, వసీమ్‌ అక్రమ్ వంటి గొప్ప పేసర్ల సరసన బుమ్రా చేరతాడు’’ అని లారా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని