Bumrah : బుమ్రా అసాధారణ బౌలింగ్‌ యాక్షన్‌ వల్లే ఎక్కువగా గాయాలు

గాయం కారణంగా ఆసియా కప్‌నకు టీమ్‌ఇండియా కీలక బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల విండీస్‌తో టీ20 సిరీస్‌కూ విశ్రాంతి తీసుకున్నాడు. ఇంకో రెండు నెలల్లో...

Published : 14 Aug 2022 14:49 IST

టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా

ఇంటర్నెట్ డెస్క్‌: గాయం కారణంగా ఆసియా కప్‌నకు టీమ్‌ఇండియా కీలక బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల విండీస్‌తో టీ20 సిరీస్‌కూ విశ్రాంతి తీసుకున్నాడు. ఇంకో రెండు నెలల్లో కీలకమైన పొట్టి ప్రపంచకప్‌ ఉంది. గాయం వల్ల మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే అభిమానులు మాత్రం బుమ్రా  కోలుకుని జట్టులోకి రావాలని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా మాత్రం బుమ్రా గాయపడటానికి తన బౌలింగ్‌ యాక్షనే కారణమని చెబుతున్నాడు. ఇతర ఫాస్ట్‌ బౌలర్లతో పోలిస్తే బుమ్రా త్వరగా గాయపడటం ఇందుకేనని తెలిపాడు. 

‘‘బుమ్రాకు అయిన గాయం ఎలాంటిదో తెలియదు. రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడటం లేదు. అదే సమస్యగా మారుతుంది. ఇక తన బౌలింగ్‌ యాక్షన్‌ కూడ అసాధారణం. దీని వల్ల తన శరీరంలోని వేర్వేరు అవయవాలు బాగా ఒత్తిడికి గురవుతాయి. ఇదే అతడిపై భారం మోపుతూ ఎక్కువగా గాయపడటానికి కారణమవుతుందని భావిస్తున్నా. పని ఒత్తిడి కారణంగానే టీవల మ్యాచ్‌లకు దూరం అవుతున్నాడనే వ్యాఖ్యలు బుమ్రా విషయంలో సరికాదు. బుమ్రా జాతీయ ఆస్తి. టాప్‌ ర్యాంకుల్లో ఉండే బుమ్రా గాయాలుపాలైతే జట్టుకు సమస్యలు తప్పవు’’ అని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని