
Subhas Bhowmick : భారతమాజీ ఫుట్‌బాల్ ఆటగాడు సుభాష్ బౌమిక్ కన్నుమూత
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు సుభాష్ బౌమిక్ (72) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ, డయాబెటిక్ సమస్యలతో బాధపడుతున్న సుభాష్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 1950 అక్టోబర్ 2న పశ్చిమ్‌బంగాలోని మాల్డా ఇంగ్లిష్ బజార్‌లో జన్మించారు. ఆసియా గేమ్‌లో రజత పతకం సాధించిన టీమ్‌ఇండియా జట్టులో సభ్యులు.
భోమ్‌బోల్డాగా సుపరిచితుడైన సుభాష్ స్ట్రైకర్. భారత్ తరఫున అంతర్జాతీయ టోర్నమెంట్లు, ఈస్ట్ బెంగాల్, మోహున్ బగన్ తరఫున దేశవాళీల్లో ఆడారు. అంతేకాకుండా ఈస్ట్ బెంగాల్, మోహున్ బగన్, మహమ్మదీన్ స్పోర్టింగ్, సాల్గోకర్, చర్చిల్ బ్రదర్స్ క్లబ్స్‌కు ఫుట్‌బాల్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 నుంచి ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించిన సుభాష్ తర్వాతి ఏడాదికే టీమ్‌ఇండియా జట్టులో స్థానం సంపాదించారు. భారత్ తరఫున దాదాపు పదిహేనేళ్లపాటు (1970-85) 69 మ్యాచుల్లో 50 గోల్స్ వరకు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.