ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ కౌశిక్‌ కన్నుమూత

భారత హాకీ మాజీ ఆటగాడు, కోచ్‌ ఎంకే కౌశిక్‌ శనివారం సాయంత్రం కరోనా వైరస్‌తో కన్నుమూశారు. మూడు వారాల క్రితం వైరస్‌ బారిన పడిన ఆయన స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేరారు...

Published : 08 May 2021 23:33 IST

దిల్లీ‌: భారత హాకీ మాజీ ఆటగాడు, కోచ్‌ ఎంకే కౌశిక్‌ శనివారం సాయంత్రం కరోనాతో కన్నుమూశారు. మూడు వారాల క్రితం వైరస్‌ బారిన పడిన ఆయన స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారని కౌశిక్‌ కుమారుడు ఎహ్‌సన్‌ మీడియాకు తెలిపారు.

1980లో మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత హాకీ జట్టులో కౌశిక్‌ ఒకరు. ఆయన రిటైరయ్యాక పురుషులు, మహిళల సీనియర్‌ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆయన సారథ్యంలో భారత పురుషుల జట్టు 1998 బ్యాంకాక్‌లో నిర్వహించిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. అలాగే మహిళల జట్టు 2006 దోహాలో నిర్వహించిన ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం గెలుపొందింది. కౌశిక్‌ సేవలను మెచ్చిన భారత ప్రభుత్వం 1998లో అర్జున అవార్డు, 2002లో ద్రోణాచార్య అవార్డులతో సత్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని