Vindo Kambli: టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లీ అరెస్టు, విడుదల

టీమ్ఇండియా మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లీని ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబయిలోని బాంద్రాలో గల ఓ రెసిడెన్సియల్‌ సొసైటీ గేట్‌ను...

Updated : 28 Feb 2022 00:17 IST

ముంబయి: టీమ్ఇండియా మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లీని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని బాంద్రాలో గల ఓ రెసిడెన్షియల్‌ సొసైటీ గేట్‌ను ఆయన కారుతో ఢీకొట్టాడు. దీంతో ఆ కాలనీ వాసులు, కాంబ్లీ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ సొసైటీవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్టు చేశారు. ప్రమాదకరంగా వాహనం నడపడంతోపాటు ఇతరులకు ఇబ్బంది కలిగించారని ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ) 279, 336, 427 సెక్షన్ల కింద వినోద్ కాంబ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని