
Yuvraj Singh: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాజ్-హేజల్ కీచ్
ఇంటర్నెట్‌డెస్క్: భారత జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్-హేజల్ కీచ్ దంపతులు తమ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు వారు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ‘‘మాకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం’’ అని యువరాజ్ ట్వీట్ చేశారు. ఇదే పోస్టును హెజల్ కీచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
బ్రిటిష్-మారిషియస్ నటి, మోడల్ అయిన హేజల్ కీచ్‌ను 2016లో యువరాజ్ సింగ్ వివాహమాడారు. ఇటీవలే వీరు తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
2000 సంవత్సరంలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువరాజ్ అనతికాలంలో స్టార్ ఆటగాడిగా వెలుగొందాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటి ఆలౌరౌండర్‌గా ఎదిగాడు. భారత్ తరఫున యువీ 304 వన్డేలు, 40 టెస్ట్‌లు, 58 టీ20లు ఆడాడు. భారత్ సాధించిన రెండు ప్రపంచకప్‌లు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. 2019 జూన్ 10న అన్ని ఫార్మాట్ల నుంచి వైదులుగొతున్నట్లు ప్రకటించాడు. దాదాపు యువీ 19 ఏళ్లపాటు భారత జట్టులో కొనసాగాడు.