Rishabh: అధిక బరువుతో పంత్.. ఇంకా ఫిట్‌గా ఉంటే అద్భుత షాట్లు కొట్టగలడు: మాజీ కెప్టెన్
టెస్టు ఫార్మాట్‌లో దూకుడుగా ఆడటంలో భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ముందుంటాడు. ప్రత్యర్థి బౌలర్లను ఆందోళనకు గురి చేస్తాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులోనూ ఇలానే వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరి అర్ధశతకం చేజార్చుకొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (46) దూకుడుగా ఆడే క్రమంలో క్లీన్‌బౌల్డ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిషభ్ పంత్ ఆటపై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.. పలు కీలక సూచనలు చేశాడు. అలాగే పంత్ అధిక బరువుతో ఉన్నాడని పేర్కొన్నాడు. అతడు ఇంకా మంచి ఫిట్‌గా ఉంటే టెస్టుల్లో వినూత్న షాట్లను అలవోకగా కొట్టగలడని తెలిపాడు.
‘‘రిషభ్ పంత్ తాను ఎలా ఆడాలని అనుకుంటున్నాడో అలా ఆడేశాడు. కొన్నిసార్లు కొత్త షాట్లను ప్రయోగించేందుకు ప్రయత్నించాడు. అయితే, బంగ్లాతో తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ బౌల్డయ్యాడు. అందుకే నేను ఎప్పుడూ రిషభ్ పంత్ ఫిట్‌నెస్‌పై సూచనలు చేస్తుంటా. అతడు మరింత ఫిట్‌గా ఉంటే విభిన్నంగా షాట్లను సులువుగా కొట్టేయగలడు. అతడు కాస్త అధిక బరువుతో ఉన్నాడని అనిపిస్తోంది. ఎందుకంటే క్రీజ్‌లో చురుగ్గా కదల్లేకపోయాడు. తప్పకుండా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది’’ అని భట్ వెల్లడించాడు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ కాగా. అనంతరం బంగ్లాను 150 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల లీడ్‌ను సాధించింది. కుల్‌దీప్ యాదవ్ (5/40) కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు