AB de Villiers: నా ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ టీ20 ప్లేయర్‌ అతడే: ఏబీ డివిలియర్స్‌

తన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ ఎవరనే విషయాన్ని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ (AB de Villiers) వెల్లడించాడు.

Updated : 08 Mar 2023 09:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికా మాజీ స్టార్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ని ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పరిగణిస్తారు. తనదైన ట్రేడ్ మార్క్‌ షాట్లు ఆడి మిస్టర్‌ 360 ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టీ20 క్రికెట్‌లో.. ముఖ్యంగా ఐపీఎల్‌లో అతడు ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌లోనూ అభిమానులను సంపాదించకున్నాడు. అయితే, ఈ మిస్టర్‌ 360 ఆటగాడు తన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ ఎవరనే విషయాన్ని బయటపెట్టాడు. ఐపీఎల్‌లో తనతోపాటు కలిసి ఆడి ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించిన విరాట్ కోహ్లీ, క్రిస్‌ గేల్‌లకు మాత్రం ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు ఏబీడీ. అనుహ్యంగా అఫ్గానిస్థాన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. రషీద్‌ ఖాన్‌ని ఎంచుకోవడానికి గల కారణాన్ని డివిలియర్స్‌ వెల్లడించాడు. 

‘నా ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్‌ మరెవరో కాదు.. రషీద్ ఖాన్. అతను బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయగలడు. రెండు విభాగాల్లోనూ మ్యాచ్ విన్నర్. మైదానంలో రషీద్‌ ఖాన్‌ శక్తిమంతమైన ఆటగాడు. సింహం వంటి గుండెను కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ గెలవాలని కోరుకుంటాడు, చాలా పోటీతత్వం గలవాడు. అతడు అత్యుత్తమ టీ20 ఆటగాళ్లలో ఒకడు కాదు.. అత్యుత్తమ ఆటగాడు’  అని డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు. రషీద్‌ ఖాన్‌ 2015లో టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌ల్లో ఇప్పటివరకు 382 మ్యాచ్‌లు ఆడి 514 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌లోనూ రషీద్‌ ఖాన్‌కు మంచి రికార్డు ఉంది. 2017లో ఈ మెగా టోర్నీలోకి అరంగేట్రం చేసిన రషీద్‌.. ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడి 112 వికెట్లు పడగొట్టాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు