Team India: శుభ్‌మన్‌గిల్‌ వీవీఎస్‌ లాంటోడు

టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ మాజీ స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ లాంటి ఆటగాడని, అతడు ఓపెనర్‌గా కాకుండా మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయాలని మాజీ సెలెక్టర్‌ గగన్‌ఖోడా అభిప్రాయపడ్డారు...

Published : 26 Jun 2021 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ మాజీ స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ లాంటి ఆటగాడని, అతడు ఓపెనర్‌గా కాకుండా మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయాలని మాజీ సెలెక్టర్‌ గగన్‌ఖోడా అభిప్రాయపడ్డారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గిల్‌ 28, 8 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఖోడా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ..

‘శుభ్‌మన్‌గిల్‌ ఓపెనర్‌ కాదు. అతడు లక్ష్మణ్‌ లాంటోడు. మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయాలి. తుదిపోరులో ఓపెనర్‌గా గిల్‌ స్థానంలో టీమ్‌ఇండియా మయాంక్‌ అగర్వాల్‌ను తీసుకోవాల్సింది. అతడు రెండు టెస్టులు మాత్రమే సరిగ్గా ఆడలేదు. అలాగే పృథ్వీషాను కూడా ఆస్ట్రేలియాలో ఒక్క మ్యాచ్‌లో విఫలమయ్యాక జట్టు నుంచి తప్పించారు. ఇక ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ ఒక అదనపు బ్యాట్స్‌మన్‌ లేదా బ్యాటింగ్ సామర్థ్యం గల ఫాస్ట్‌బౌలర్‌ను తీసుకోవాల్సింది. శార్దూల్‌ ఠాకూర్‌ లాంటి ఆటగాడైతే పనిపూర్తి చేసేవాడు’ అని ఖోడా అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని