IND vs SL: చివరి ఓవర్‌లో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.. అక్షర్‌పై మాజీ సెలెక్టర్ ప్రశంసలు
మ్యాచ్‌పై ఆశలు ఆవిరవుతున్న వేళ యువ ఆటగాడు అక్షర్ పటేల్(Axar patel) తెలివైన ప్రదర్శన ఆకట్టుకుందని మాజీ సెలెక్టర్ సాబా కరీమ్ అన్నాడు.
ముంబయి: టీమ్‌ఇండియా యువ ఆటగాడు అక్షర్ పటేల్‌పై పొగడ్తల వర్షం కురుస్తోంది. శ్రీలంకతో తొలి టీ20(IND vs SL)లో కీలక ఓవర్‌లో అతడు సంధించిన బంతులు జట్టును గెలుపు పథంలో నడిపించిన విషయం తెలిసిందే. మాజీ సెలెక్టర్ సాబా కరీమ్ ఈ ఆల్‌రౌండర్ ప్రతిభను ప్రశంసించాడు. చివరి ఓవర్‌లో ప్రత్యర్థి బ్యాటర్‌ను అతడి బౌలింగ్ నైపుణ్యం చిక్కుల్లోకి నెట్టిందన్నాడు.
‘‘హార్దిక్ పాండ్యా చివరి ఓవర్‌లో ఆడకపోవడంతో అక్షర్ పటేల్(Axar patel) ఆ బాధ్యతను తీసుకోవలసి వచ్చింది. నిజంగా ఇది ఈ యువ ఆటగాడికి చాలా కఠినమైన సవాలు. భారీ షాట్లు ఆడగల సత్తా ఉన్న బ్యాటర్‌ను ఎదుర్కోవడం.. అందులోనూ 13 పరుగులు చేయకుండా ఆపడం సులువైన పని కాదు. కానీ, అక్షర్ చాలా తెలివిగా బంతులను వేశాడు. అతడి ఫుల్ లెంత్ డెలివరీలను ఆడటానికి ఆ బ్యాటర్ చాలా ఇబ్బందిపడ్డాడు’’ అంటూ సాబా కరీం పేర్కొన్నాడు. ఓ సందర్భంలో భారత జట్టు 150 స్కోరు మార్కును కూడా అందుకునేందుకు కష్టపడిందని.. ఆ సమయంలో దీపక్, అక్షర్ జట్టును ఆదుకున్నారని ప్రశంసించాడు.
పేలవమైన ప్రదర్శనతో మ్యాచ్‌ను ఆరంభించిన టీమ్‌ఇండియా(Team India).. 15 ఓవర్ల తర్వాత దూకుడుగా ముందుకు సాగింది. మ్యాచ్ చేజారుతుందనుకున్న సమయంలో చివరి ఓవర్‌లో అక్షర్ తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో కీలకమైన రెండో టీ20 పుణె వేదికగా గురువారం జరగనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ap-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..