WWE మాజీ రెజ్లర్‌ సారా లీ హఠాన్మరణం

ప్రముఖ మాజీ వరల్డ్ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ (wwe) రెజ్లర్‌ సారా లీ (30) హఠాన్మరణం చెందింది. 2015లో డబ్ల్యూడబ్ల్యూఈ రియాల్టీ కాంపిటేషన్‌ విజేత అయిన సారా మృతి చెందినట్లు ఆమె తల్లి టెర్రీ లీ వెల్లడించారు.

Published : 07 Oct 2022 22:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరల్డ్ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) మాజీ రెజ్లర్‌ సారా లీ (30) హఠాన్మరణం చెందింది. 2015లో WWE రియాల్టీ కాంపిటేషన్‌ విజేత అయిన సారా మృతి చెందినట్లు ఆమె తల్లి టెర్రీ లీ వెల్లడించారు. మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ సారా వెస్టన్‌ లీ దేవుడి వద్దకు చేరిందని ఆమె పేర్కొన్నారు. సారా లీ హఠాన్మరణంపై రెజ్లింగ్‌ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తమ సంతాపాలను తెలియజేస్తూ సోషల్‌ మీడియా వేదికగా సందేశాలు పెట్టారు.

డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌ నిక్కి యాష్‌ స్పందిస్తూ.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ ఇలా ప్రతి ఒక్కరినీ ప్రేమించే సారా దూరం కావడం బాధాకరమని పేర్కొంది. మరో రెజ్లర్‌ చెల్సీ గ్రీన్‌.. ‘‘ఏం మాట్లాడాలో.. ఏమని ట్వీట్‌ చేయాలో తెలియడం లేదు. ఇంత మంచి మనిషిని తిరిగి ఇవ్వాలని దేవుడిని కోరుతున్నా. సారా లీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆమె నవ్వుతూ, హాయిగా, స్వేచ్ఛగా ఉన్న ఫొటోను ఎప్పటికీ మరిచిపోలేను’’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫొటోలను షేర్‌ చేసింది.
Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts