U19 World Cup: మా దేశానికి పంపించొద్దు..!

వెస్టిండీస్‌ వేదికగా ఇటీవల జరిగిన అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు ఘన విజయం సాధించి కప్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్థాన్ జట్టు కూడా పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబర్చింది. గతంలో కంటే మెరుగ్గా ఆడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, ప్రపంచకప్‌

Published : 08 Feb 2022 23:21 IST

తాలిబన్లకు భయపడేనా?

లండన్‌: వెస్టిండీస్‌ వేదికగా ఇటీవల జరిగిన అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు ఘన విజయం సాధించి కప్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్థాన్ జట్టు కూడా పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబర్చింది. గతంలో కంటే మెరుగ్గా ఆడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, ప్రపంచకప్‌ పోటీలో అఫ్గాన్‌ ప్రస్థానం ముగియగానే ఆ జట్టు తిరిగి స్వదేశానికి తిరిగి వెళ్లగా.. అందులో ఒక ఆటగాడు, ముగ్గురు సిబ్బంది ప్రస్తుతం లండన్‌లోనే ఉండిపోయారు. నేటితో వారి ట్రాన్సిట్‌ వీసా ముగియనుంది. అయినా వారు స్వదేశం వెళ్లడానికి ఇష్టపడట్లేదు.

అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, క్రీడాకారులు తాలిబన్లకు భయపడి విదేశాలకు వలస వెళ్లారు. తాజాగా ఈ నలుగురు కూడా యూకేలో ఆశ్రయం పొందాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఇంగ్లాండ్‌ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నట్లు అఫ్గాన్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఈ విషయం తెలుసుకున్న అఫ్గాన్‌ మాజీ క్రికెటర్‌, ఆ దేశ జట్టు హెడ్‌ కోచ్‌ రాయీస్‌ అహ్మద్జాయ్‌ ఆ నలుగురిని తిరిగి స్వదేశానికి రావాలని కోరారు. ‘దేశానికి మీ అవసరం ఉంది. క్రికెట్‌, క్రీడలు ఈ దేశానికి ఎంతో చేశాయి. ఈ ప్రపంచకప్‌లో మన జట్టు ప్రదర్శన అత్యద్భుతం. దేశం కోసం చేసే కొన్ని పనులు జీవితానికి ఒక అర్థానిస్తాయి. దయచేసి స్వదేశానికి తిరిగి వచ్చేయండి’’అంటూ సందేశం పంపించగా.. వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని రాయీస్‌ చెప్పుకొచ్చారు. అఫ్గాన్‌ క్రికెట్‌ కోసం వారు కష్టపడ్డారని, కచ్చితంగా తిరిగొస్తారని తాను నమ్ముతున్నట్లు రాయీస్‌ తెలిపారు. ఒకవేళ వారు అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నా.. అఫ్గాన్‌ క్రికెట్‌కు వచ్చే నష్టమేమి లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు