French Open 2022: తిరుగులేని ఇగా స్వైటెక్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సొంతం

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నం.1 ఇగా స్వైటెక్‌ విజేతగా నిలిచింది. పోలండ్‌కు చెందిన స్వైటెక్‌.......

Updated : 04 Jun 2022 20:49 IST

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెం.1 ఇగా స్వైటెక్‌ విజేతగా నిలిచింది. పోలెండ్‌కు చెందిన స్వైటెక్‌.. ఫైనల్‌ పోరులో అమెరికాకు చెందిన కోకో గాఫ్‌పై సునాయాసంగా గెలుపొందింది. 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. ఫోర్‌ హ్యాండ్‌, బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడుతూ.. ఆట ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన స్వైటెక్‌ ఈ పోరును కేవలం 68 నిమిషాల్లోనే ముగించడం విశేషం. ఈ గెలుపుతో ఆమె రెండో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2020లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌తో గ్రాండ్‌స్లామ్‌ విజేతగా నిలిచిన తొలి పోలెండ్‌ సింగిల్స్‌ క్రీడాకారిణిగా స్వైటెక్‌ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని