French Open: ప్రపంచ నంబర్‌ 1కు షాక్‌.. జకోవిచ్‌ను ఓడించిన రఫెల్‌ నాదల్‌

ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్‌ బుల్‌, మట్టి కోర్టు రారాజు రఫెల్‌ నాదల్‌ మరోసారి అదరగొట్టాడు. బుధవారం తెల్లవారుజామున జరిగిన పురుషుల సింగిల్స్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌ 1 నొవాక్‌ జకోవిచ్‌ను మట్టికరిపించి

Published : 01 Jun 2022 10:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్‌ బుల్‌, మట్టి కోర్టు రారాజు రఫెల్‌ నాదల్‌ మరోసారి అదరగొట్టాడు. బుధవారం తెల్లవారుజామున జరిగిన పురుషుల సింగిల్స్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌ 1 నొవాక్‌ జకోవిచ్‌ను మట్టికరిపించి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో  6-2, 4-6, 6-2, 7-6 (7/4) తేడాతో జకోవిచ్‌పై నాదల్‌ విజయం సాధించాడు. ఈ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో నాదల్‌ సెమీస్‌ చేరడం ఇది 15వ సారి. ఈ మ్యాచ్‌లో విజయంతో గతేడాది సెమీఫైనల్లో ఓటమికి నాదల్‌.. జకోవిచ్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఫైనల్ బెర్త్ కోసం తొలి సెమీఫైనల్లో నాదల్, అలెగ్జాండర్‌ జ్వెరేవ్  (జర్మనీ) తలపడనున్నారు.

జకోవిచ్‌ని ఓడించిన అనంతరం నాదల్‌ మాట్లాడాడు. ‘‘ఎన్నెన్నో భావోద్వేగాలు నన్ను చుట్టుముట్టాయి. ఇక్కడ ఆడటం నిజంగా నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. జకోవిచ్‌తో పోటీ పడటం అతిపెద్ద సవాలు. అతడిని ఓడించాలంటే మ్యాచ్‌లో మొదటి నుంచి చివరి వరకు మనలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చాలి’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. ‘నాదల్‌కు అభినందనలు. అతడో గొప్ప ఛాంపియన్‌. ఆటలో చాలా సందర్భాలలో నాకంటే పైచేయి సాధించాడు. ఈ విజయానికి అతడు అర్హుడు’ అని నాదల్‌పై జకోవిచ్‌ ప్రశంసలు కురిపించాడు. 




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని