క్రికెట్‌ మైదానంలో అలరించిన స్టార్‌వార్స్‌ 

టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో శనివారం పలువురు అభిమానులు స్టార్‌వార్స్‌ గెటప్‌లో దర్శనమిచ్చారు...

Published : 17 Jan 2021 15:15 IST

(ICC Twitter Photo)

బ్రిస్బేన్‌: టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో శనివారం పలువురు అభిమానులు స్టార్‌వార్స్‌ గెటప్‌లో దర్శనమిచ్చారు.  హాలివుడ్‌ సినిమాలోని పాత్రలలాగే ఒక బృందంగా ఏర్పడిన కొంత మంది క్రికెట్‌ అభిమానులు తెల్లటి దస్తుల్లో మాస్కులు ధరించి గ్యాలరీలో సందడి చేశారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఐసీసీ సైతం వారి ఫొటోను ట్విటర్‌లో పంచుకొంది. వారికే ‘బెస్ట్‌ డ్రెసప్‌ అవార్డు’ అని సరదాగా పేర్కొంది. ఇది చూసిన నెటిజన్లు లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు. 

మరోవైపు మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటవ్వగా అనంతరం భారత్‌ 336 పరుగులు చేసింది. ఆదివారం టీమ్‌ఇండియా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెద్ద స్కోర్లు సాధించకపోయినా.. శార్దూల్‌ ఠాకుర్‌(67), వాషింగ్టన్‌ సుందర్‌(62) అర్ధశతకాలతో రాణించారు. ఈ క్రమంలోనే ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 33 పరుగులుగా నమోదైంది. ఇక మూడో రోజు ఆట నిలిచిపోయే సమయానికి ఆతిథ్య జట్టు 21/0తో నిలిచింది. వార్నర్‌(20), హారిస్‌(1) క్రీజులో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 54 పరుగులకు చేరింది. 

ఇవీ చదవండి..
శార్దూల్‌, సుందర్‌ రికార్డు భాగస్వామ్యం
టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 336 ఆలౌట్‌ 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని