గబ్బా టెస్ట్‌: తొలి ఓవర్‌లోనే వికెట్‌

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఓవర్‌లోనే భారత్‌ షాకిచ్చింది. సిరీస్‌లో సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న డేవిడ్‌ వార్నర్‌

Updated : 15 Jan 2021 06:06 IST

బ్రిస్బేన్‌: బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఓవర్‌లోనే భారత్‌ షాకిచ్చింది. సిరీస్‌లో సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న డేవిడ్‌ వార్నర్‌ (1)ను మహ్మద్‌ సిరాజ్‌ పెవిలియన్‌కు పంపించేశాడు. తొలి ఓవర్‌ నాలుగో బంతికి స్లిప్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్‌ స్లిప్‌కు కాస్త ముందు పడుతున్న బంతిని రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్‌ డైవ్‌ చేస్తూ సూపర్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. గాయాల కారణంగా మొత్తం కొత్త బౌలర్లతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే వికెట్‌ దక్కడం ఎంతైనా ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం క్రీజులో మార్కస్‌ హారిస్‌ (5*), మార్నస్‌ లబుషేన్‌ (5*) ఉన్నారు. ఏడు ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 17/1.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని