Paris Olympic Games 2024: పారిస్‌ ఒలింపిక్స్‌ చెఫ్‌ దే మిషన్‌గా గగన్‌ నారంగ్‌..పతాకధారిగా సింధు

జులై 26న ప్రారంభం కానున్న పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్తున్న భారత్‌ బృందానికి చెఫ్‌ దే మిషన్‌గా షూటర్ గగన్‌ నారంగ్‌ నియమితులయ్యారు.

Published : 08 Jul 2024 21:34 IST

పారిస్‌: జులై 26న ప్రారంభం కానున్న పారిస్‌ ఒలింపిక్స్‌కు (Paris Olympic Games 2024) వెళ్తున్న భారత్‌ బృందానికి చెఫ్‌ దే మిషన్‌గా షూటర్ గగన్‌ నారంగ్‌ (Gagan Narang) నియమితులయ్యారు. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ స్థానంలో భారత ఒలింపిక్‌ సంఘం (IOA) నారంగ్‌ను నియమించింది. షూటింగ్‌ విభాగంలో భారత్‌కు నారంగ్‌ నాలుగు ఒలింపిక్స్‌ పతకాలు తీసుకొచ్చారు. ఏప్రిల్‌లో మేరీ కోమ్‌ చెఫ్‌ దె విషన్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాశారు. తాజాగా ఆమె స్థానంలో గగన్‌ నారంగ్‌కు అవకాశం వచ్చింది.

మరోవైపు ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో భారత్‌ తరఫున టేబుల్‌ టెన్నిస్ ఆటగాడు శరత్‌ కమల్‌తోపాటు మహిళా స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పతాకధారిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వెల్లడించారు. పీవీ సింధు ఇప్పటి వరకు రెండు ఒలింపిక్స్‌ పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్లు రాణిస్తారన్న నమ్మకం తనకుందని ఈ సందర్భంగా ఉష ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని