పంత్‌ది సాహసోపేతమైన షాటే కాదు..‌: గంభీర్‌

గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌(21; 23 బంతుల్లో 2x4, 1x6).. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడిన సంగతి తెలిసిందే...

Updated : 23 Aug 2022 11:57 IST

(Photo: BCCI)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌(21; 23 బంతుల్లో 2x4, 1x6).. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడిన సంగతి తెలిసిందే. ఆ బంతి సిక్సర్‌గా దూసుకెళ్లడంతో అటు అభిమానులే కాకుండా ఇటు మాజీ క్రికెటర్లు సైతం ఆ షాట్‌కు మంత్రముగ్ధులయ్యారు. ఇప్పుడా షాట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ సైతం పంత్‌ను మెచ్చుకున్నాడు. అతడాడింది సాహసోపేతమైన షటే కాకుండా కచ్చితమైన లెక్కతో కూడినదని ప్రశంసించాడు.

ఓ క్రీడా ఛానల్‌లో సంజయ్‌ బంగర్‌తో మాట్లాడిన గౌతీ.. పంత్ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ‘అదో అద్భుతమైన షాట్‌. సాహసోపేతమైనది కూడా. టీమ్‌ఇండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోగా.. పంత్‌ త్వరగా క్రీజులోకి వచ్చాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో కచ్చితమైన లెక్కతో ఆడిన షాట్‌ అది. థర్డ్‌ మ్యాన్‌ లేనప్పుడు డీప్‌స్క్వేర్‌ లెగ్‌, ఫైన్‌లెగ్‌లో ఫీల్డర్లు ఉండగానే మంచి షాట్‌ ఆడాడు’ అని గంభీర్‌ వివరించాడు. కాగా, పంత్‌ ఇలాంటి స్కూప్‌ షాట్‌ ఆడడం ఇటీవల ఇది రెండోసారి. ఇదివరకు ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులోనూ అండర్సన్‌ బౌలింగ్‌లో ఇలాంటి రివర్స్‌ స్కూప్‌ షాటే ఆడాడు. దానికన్నా ఇప్పుడు ఆడిన షాట్‌ బాగుందని క్రికెట్‌ పండితులు అభినందిస్తున్నారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని