Gambhir: మాజీ ఆటగాళ్లకు మసాలా అవసరం.. కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలిచిన గంభీర్
కేఎల్ రాహుల్(KL Rahul)పై విమర్శలు చేస్తున్న వారిపై గౌతమ్ గంభీర్(Gautam Gambhir) విరుచుకుపడ్డాడు. ఐపీఎల్‌లో రాహుల్ గొప్ప ఆటగాడని కొనియాడాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ఇటీవల కేఎల్ రాహుల్(KL Rahul) ప్రదర్శనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) మాత్రం అతడికి మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్(IPL)లో లఖ్‌నవూ జట్టుకు మెంటారైన గంభీర్.. కేఎల్‌పై విమర్శలు చేసేవారిపై విరుచుకుపడ్డాడు. మాజీ ఆటగాళ్లు యాక్టివ్‌గా ఉండటానికి వారికి మసాలా అవసరమంటూ ఎద్దేవా చేశాడు. మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్‌లాంటి వారు కేఎల్ రాహుల్‌పై విమర్శలు చేసిన నేపథ్యంలో.. గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ ఒత్తిడిలో ఉన్నాడా..? అని గంభీర్‌ను ప్రశ్నించగా.. రాహుల్ ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడిలో లేడని.. ఐపీఎల్‌లో అతడు గొప్ప ఆటగాడని కొనియాడాడు. ‘ఐపీఎల్‌లో గొప్ప ఆటగాడిగా కేఎల్ రాహుల్ ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. లఖ్‌నవూ జట్టుకు అతడు కెప్టెన్‌గా ఉన్నాడు. గత సీజన్‌లో జట్టును అతడు ప్లేఆప్స్‌కు చేర్చాడు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటికే 4 శతకాలు బాదాడు. గత సీజన్‌లోనూ ముంబయిపై సెంచరీ కొట్టాడు. ఇక విమర్శలు చేసే వారు చాలా మంది ఉన్నారు. మాజీ క్రికెటర్లు యాక్టివ్‌గా ఉండేందుకు వారికి కొంత మసాలా కావాలి. అందుకే వారు విమర్శలు చేస్తుంటారు. కేఎల్ రాహుల్‌లాంటి ఆటగాడు ఎలాంటి ఒత్తిడికి గురికాడు’ అని గంభీర్ వివరించాడు.
‘ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ భిన్నమైనవి. ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు చేసినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో సరిగ్గా రాణించకపోతే మీరు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున ఆడేందుకు 15 మందికే అవకాశం లభిస్తుంది. అదే ఐపీఎల్‌లో 150 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లకు అవకాశాలు ఉంటాయి’ అని గంభీర్ పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ సారథ్యంలో లఖ్‌నవూ జట్టు మరోసారి ఐపీఎల్‌లో ఉత్తమ ప్రదర్శన చేస్తుందని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండు టెస్టుల్లో విఫలం కావడంతో అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను తీసుకున్నారు. ఇక ఆసీస్‌తో తొలి వన్డే(IND vs AUS)లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ.. రెండో వన్డేలో రాహుల్ మరోసారి తేలిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
హైకమిషనర్‌ని అడ్డుకోవడం అవమానకరం.. గురుద్వారా ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్
-
Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణలో ‘మోత మోగింది’
-
Chandrababu Arrest : చంద్రబాబుకు సంఘీభావంగా ‘మోత మోగింది’
-
IND vs ENG: ఒక్క బంతీ పడలేదు.. భారత్- ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ రద్దు
-
TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
-
Kerala: నిఫా నాల్గో వ్యాప్తిలో.. మరణాల శాతం ‘33’కే కట్టడి!