Gautham gambhir: భవిష్యత్‌లో కెప్టెన్సీ కోసం వీరిద్దరి మధ్యే పోటీ.. : గౌతమ్‌ గంభీర్‌

కెప్టెన్సీ రేసులో పాండ్యాతో పాటుగా పృథ్వీ షాను పేర్కొనడంపై గౌతమ్‌ గంభీర్‌ కారణాలను వెల్లడించాడు. 

Updated : 29 Nov 2022 13:37 IST

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ ఓపెనింగ్‌ బ్యాటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తాజాగా మరో ఆసక్తికర అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. టీమ్‌ఇండియాకు భవిష్యత్తు కెప్టెన్లు వీరేనంటూ హార్దిక్‌ పాండ్యా, పృథ్వీ షా పేర్లను సూచించాడు. టీ20ల్లో రోహిత్‌ శర్మ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగలవాడిగా పాండ్యా పేరు వినిపిస్తోంది. కానీ, 2021 తర్వాత ప్రధాన జట్టులో ఆడని రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ పృథ్వీ పేరును గంభీర్‌ తన జాబితాలో పేర్కొనడం గమనార్హం.

‘‘హార్దిక్‌ పాండ్యా కచ్చితంగా కెప్టెన్సీ రేసులో ఉంటాడు. కానీ, రోహిత్‌ శర్మకు ఈ విషయంలో దురదృష్టమే.. ఎందుకంటే ఒకే ఒక్క ఐసీసీ ఈవెంట్‌ ఆధారంగా అతడి ప్రతిభను లెక్కించలేం. ఇక నేను పృథ్వీషా పేరును ప్రతిపాదించగానే గతంలో అతడిపై ఉన్న ఇతర అంశాల గురించే అంతా మాట్లాడుతుంటారు. కానీ, జట్టుకు అవసరమైన 15 మందిని ఎంపిక చేసుకోవడం మాత్రమే కోచ్‌ బాధ్యత కాదు. వారిని సరైన మార్గంలో నడిపించగలగాలి. పృథ్వీకి దూకుడు ఎక్కువ. అందుకే అతడు గొప్ప కెప్టెన్‌గా రాణించగలడని నేను నమ్ముతున్నా’’ అంటూ ఫిక్కీ(ఎఫ్‌ఐసీసీఐ)తో మాట్లాడుతూ గంభీర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని