Team India: టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్‌గా ఆర్సీబీ మాజీ పేసర్?

టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తన కోచింగ్ స్టాఫ్‌లోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై దృష్టిపెట్టాడు.

Published : 10 Jul 2024 17:09 IST

ఇంటర్నెట్ డెస్క్: అందరూ ఊహించినట్టుగానే టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Gautam Gambhir) స్థానంలో గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. ద్రవిడ్‌తోపాటు అతడి సహాయక సిబ్బంది పదవీకాలం కూడా ముగిసింది. గంభీర్ ఇప్పుడు తన కోచింగ్ స్టాఫ్‌లోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై దృష్టిపెట్టాడు. అసిస్టెంట్‌ కోచ్‌గా ముంబయి మాజీ ఆటగాడు అభిషేక్‌ నాయర్‌ను తీసుకోవాలని గంభీర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు నాయర్‌ సహాయ కోచ్‌గా పనిచేస్తున్నాడు.ఇక, బౌలింగ్ కోచ్‌గా భారత, ఆర్సీబీ మాజీ పేసర్‌ ఆర్‌.వినయ్‌ కుమార్‌ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

 మరోవైపు, బీసీసీఐ బౌలింగ్‌ కోచ్‌ లిస్ట్‌లో టీమ్‌ఇండియా మాజీ పేసర్ జహీర్‌ ఖాన్‌ పేరు ఉందని సమాచారం. వినయ్‌ కుమార్‌ ఆర్సీబీ తరఫున ఐదు సీజన్లలో (2008-2010, 2012-2013) ఆడాడు. బెంగళూరు తరఫున 70 మ్యాచ్‌లు ఆడి 80 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2014, 2018 సీజన్లలో కేకేఆర్‌ తరఫున ఆడాడు. 2014 సీజన్‌లో గంభీర్‌ సారథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక, ఈ నెలాఖరులో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లి మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ టూర్‌తో గంభీర్‌ భారత కోచ్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు