Suryakumar Yadav: సూర్యకుమార్‌ అతని కన్నా ప్రతిభావంతుడు: గంభీర్‌

:టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు అసాధారణమైన ఆటగాడని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసించాడు. టీ20 ఫార్మాట్‌లో రాణించేందుకు అవసరమైన అన్ని మెళకువలు అతనిలో ఉన్నాయన్నాడు. శ్రేయస్‌

Published : 11 Sep 2021 02:27 IST

(Photo:Suryakumar Yadav Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు అసాధారణమైన ఆటగాడని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసించాడు. టీ20 ఫార్మాట్‌లో రాణించేందుకు అవసరమైన అన్ని మెళకువలు అతనిలో ఉన్నాయన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో పోల్చి చూస్తే సూర్యకుమార్‌ ఎంతో ప్రతిభావంతుడని గంభీర్ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకుమార్ చోటు దక్కించుకున్నాడు. 

‘సూర్యకుమార్‌ యాదవ్‌ పూర్తి భిన్నమైన ఆటగాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో పోలిస్తే అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. అసాధారణమైన ఆటగాడు. టీ20 ఫార్మాట్‌లో మనకు ఇలాంటివారే కావాలి. బంతిని మైదానంలో నలువైపులా బాదే ఆటగాళ్లు మనకు కావాలి. టీ20 క్రికెట్‌ అంటేనే అది. సూర్యకుమార్‌.. లాప్‌ (కీపర్‌ వెనుక మీదుగా బాదడం), లేట్‌ కట్‌, ఎక్స్‌ ట్రా కవర్ షాట్‌లతోపాటు అన్ని రకాల షాట్లను ఆడగలడు. ముఖ్యంగా నాలుగో స్థానంలో. ఎందుకంటే కొన్నిసార్లు టీ 20 క్రికెట్‌లో బ్యాటింగ్ చేయడానికి నాలుగో స్థానం అత్యంత కఠినమైనది. బహుశా మొదటి మూడు స్థానాలు చాలా సులభమైనవి. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినప్పుడు  జట్టు అంతకుముందే  రెండు వికెట్లు కోల్పోయి ఉండొచ్చు. అప్పుడు పరుగులు రాబట్టడం కోసం వేగంగా ఆడతారు’ అని గంభీర్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని