Gautam gambhir: నేనైతే ఆ ఇద్దరి స్థానాలను షమీ, పంత్‌తో మార్చేస్తా: గంభీర్‌

ప్రపంచపోరుకు సిద్ధమైన భారత జట్టుపై మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో కీలక పాత్ర పోషించే భారత ఆటగాళ్లెవరో అంచనా వేశాడు.

Published : 22 Oct 2022 01:44 IST

దిల్లీ: ప్రపంచపోరుకు సిద్ధమైన భారత జట్టుపై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో కీలక పాత్ర పోషించే భారత ఆటగాళ్లెవరో అంచనా వేశాడు. తానైతే భువనేశ్వర్‌ కుమార్‌కు బదులుగా షమీని ఎంచుకుంటానని.. అలాగే దినేశ్‌ కార్తీక్‌కు బదులుగా రిషభ్‌ పంత్‌ను తీసుకుంటానని తెలిపాడు. అందుకు గల కారణాలనూ వివరించాడు. 

‘‘జట్టులో ముగ్గురు పేసర్లు ఉండాలి. నా అంచనా ప్రకారం.. భువనేశ్వర్‌ స్థానంలో మహమ్మద్‌ షమీని ఆడించాలి. అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌కు మిగిలిన రెండు స్థానాలు ఇవ్వాలి. కేవలం పది బంతులు ఆడటానికే ఆటగాళ్లను ఎంచుకోకూడదు. కార్తీక్‌కు సుదీర్ఘంగా ఆడే అవకాశం ఇవ్వలేదో లేక అతడు అలాంటి ప్రదర్శన చేయలేదో తెలియదు గానీ అతడు కేవలం డెత్‌ ఓవర్లలో మూడు నాలుగు బంతులు మాత్రమే ఆడటానికి వచ్చేవాడు. ఒకవేళ భారత్‌ వెంటవెంటనే రెండు వికెట్లు నష్టపోతే ఏంటి పరిస్థితి? అందుకే ఆ స్థానంలో పంత్‌ సరైన ఎంపిక. హార్దిక్‌ను తొలి ఓవర్లలో పంపకపోవడమే మంచిది. యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌ ఇద్దరూ స్పిన్నర్లుగా ఉంటారు. ఓపెనర్‌గా అయినా డెత్‌ ఓవర్లలో అయినా బౌలర్‌గా షమీ రాణిస్తాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో అతడు గొప్పగా ఆడాడు’’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని