Gautam Gambhir: శ్రీలంక పతాకంతో గౌతం గంభీర్‌ సందడి..!

ఆసియా కప్‌ ఫైనల్‌లో పాక్‌పై విజయం సాధించిన శ్రీలంక జట్టుకు ఓ భారత మాజీ స్టార్‌ ఆటగాడి నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఆ ఆటగాడు ఏకంగా శ్రీలంక పతాకాన్ని

Published : 12 Sep 2022 12:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసియా కప్‌ ఫైనల్‌లో పాక్‌పై విజయం సాధించిన శ్రీలంక జట్టుకు ఓ భారత మాజీ స్టార్‌ ఆటగాడి నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఆ ఆటగాడు ఏకంగా శ్రీలంక జాతీయ పతాకాన్ని పట్టుకొని మైదానంలోకి వెళ్లి పోజులిచ్చాడు. అతడే గౌతం గంభీర్‌..! దీనికి సంబంధించిన వీడియోను గంభీర్‌ స్వయంగా ట్విటర్‌లో పోస్టు చేశాడు. దీనికి ఆయన ‘‘సూపర్‌ స్టార్‌ టీమ్‌.. నిజంగా అర్హులు #కంగ్రాట్స్‌శ్రీలంక’’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. 

ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక అన్ని విభాగాల్లో రాణించి కప్‌ను దక్కించుకుంది. ఈ మ్యాచ్‌ అనంతరం గంభీర్‌ మైదానంలోకి వెళ్లి  శ్రీలంక పతాకం పట్టుకొని శానక బృందానికి అభినందనలు తెలియజేశాడు. ఈ సందర్భంగా శ్రీలంక అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ మ్యాచ్‌లో 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన లంక పుంజుకొని 170 స్కోర్‌ను చేరుకుంది. లక్ష్య ఛేదనలో పాక్‌ ఒక దశలో 93పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి బలంగా కనిపించినా.. చివరకు లంక బౌలర్ల ధాటికి 147కే ఆలౌటైంది. శానక బృందం ఆసియాకప్‌ను సాధించడం ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంకలో సంతోషాన్ని నింపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని