IND Vs PAK : ఆ అంశంలో బీసీసీఐ, పీసీబీ కలిసి నిర్ణయం తీసుకోవాలి: గంభీర్
పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా హెచ్చరికలపై భారత్ నుంచి దీటుగా స్పందన వస్తోంది. నిన్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా మాజీ ఓపెనర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు.
ఇంటర్నెట్‌డెస్క్: పాక్‌లో భారత్ ఆడకపోతే.. తాము కూడా ఆ దేశంలో ఆడేది లేదని పీసీబీ చీఫ్ రమీజ్ రజా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. రజా హెచ్చరికలపై నిన్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా మాజీ ఓపెనర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. ‘ఇది బీసీసీఐ, పీసీబీ తీసుకోవాల్సిన నిర్ణయం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా సమష్టిగా తీసుకోవాలి’ అని గంభీర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
వచ్చే ఏడాది పాక్‌లో ఆసియా కప్ జరగనుంది. ఆ తర్వాత అదే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్ నిర్వహించనున్నారు. గతంలో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ.. పాక్‌తో తటస్థ వేదికలపైనే ఆడతామని, ఆ దేశంలో పర్యటించే అవకాశం లేదని చెప్పారు. దీనిపై ఇటీవల పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా స్పందిస్తూ.. బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకుంటే.. భారత్‌లో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్ భాగం కాబోదని హెచ్చరిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. అతడి హెచ్చరికలపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రపంచ క్రీడల్లో భారత్ అత్యంత శక్తిమంతమైన దేశమని, తమను ఎవరూ శాసించలేరని దీటుగా బదులిచ్చారు. తాజాగా ఇదే అంశంపై గంభీర్ స్పందించాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: మమ్మల్ని అంతం చేసే కుట్రే..! రాహుల్కు శిక్షపై ప్రతిపక్షాల మండిపాటు
-
India News
AAP Vs BJP: దేశ రాజధానిలో ‘పోస్టర్’ వార్..!
-
Movies News
Nani: ఆ దర్శకుడు అందరి ముందు నన్ను అవమానించాడు: నాని
-
Crime News
Crime News : స్టాక్ మార్కెట్ మోసగాడు.. 27 ఏళ్ల తర్వాత చిక్కాడు!
-
Politics News
Cm Kcr: రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం.. ఎకరాకు రూ.10వేలు పరిహారం: సీఎం కేసీఆర్
-
Movies News
Samantha: అలాంటి పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది: సమంత