RCB:వచ్చే సీజన్‌కి ఆర్‌సీబీ డివిలియర్స్‌ని రిటైన్‌ చేసుకోదు:గంభీర్‌

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ని జట్టులో కొనసాగించాలని భావిస్తే.. ఏబీ డివిలియర్స్‌ని రిటైన్‌ (అంటిపెట్టుకోవడం) చేసుకోకపోవచ్చని భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున అత్యధిక పరుగులు (513)

Published : 13 Oct 2021 14:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ని జట్టులో కొనసాగించాలని భావిస్తే.. ఏబీ డివిలియర్స్‌ని రిటైన్‌  చేసుకోకపోవచ్చని భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున అత్యధిక పరుగులు (513) చేసిన మ్యక్సీకి ఆ జట్టులో మంచి భవిష్యత్తు ఉందని, 37 ఏళ్ల డివిలియర్స్‌కు  ఈ అవకాశం లేదని గంభీర్‌ అన్నాడు. వచ్చే సీజన్‌లో డివిలియర్స్‌ని బెంగళూరు రిటైన్‌ చేసుకోదని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు..‘అవును. రిటైన్‌ చేసుకోదు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి అతడి రిటైన్‌ చేసుకుంటుందని అనుకుంటున్నా. డివిలియర్స్‌కి ఈ అవకాశం లేదు’అని సమాధానమిచ్చాడు. ఆర్‌సీబీ మ్యాక్స్‌వెల్‌తోపాటు విరాట్‌ కోహ్లి, యుజువేంద్ర చాహల్‌ని రిటైన్‌ చేసుకోవాలనుకుంటున్నట్లు గౌతీ పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌  2011లో ఆర్‌సీబీ జట్టులో చేరాడు.ఇప్పటివరకు 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ.. 5162 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో డివిలియర్స్ 313 పరుగులు చేశాడు. ఇందులో అత్యధికంగా తొలి దశలో చేసినవే. ఇదిలా ఉండగా, సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో బెంగళూరు ఓటమిపాలైంది. ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి అదే చివరి మ్యాచ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని