IND Vs Sri Lanka : చాహల్‌ స్థానంలో ఎవరిని ఆడించాలంటే..? : గంభీర్‌

ఆసియా కప్‌లో నేడు భారత్‌కు చావోరేవో మ్యాచ్‌. సూపర్‌ 4లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాక్‌పై ఓటమితో టీమ్‌ఇండియాకు

Published : 06 Sep 2022 17:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  ఆసియా కప్‌లో నేడు భారత్‌కు చావోరేవో మ్యాచ్‌. సూపర్‌ 4లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాక్‌పై ఓటమితో టీమ్‌ఇండియాకు సంకట పరిస్థితి నెలకొంది. ఫైనల్‌ రేసులో నిలవాలంటే శ్రీలంకతో మంగళవారం జరిగే మ్యాచ్‌తో భారత్‌ తప్పక గెలవాలి. ఈ నేపథ్యంలో జట్టు బౌలింగ్‌ దళం కూర్పుపై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ పలు సూచనలు చేశాడు.

టోర్నీలో నిరాశపరుస్తున్న చాహల్‌ స్థానంలో అవేశ్‌ ఖాన్‌ను తీసుకోవాలని గంభీర్‌ సూచించాడు. ఇక యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కి మరింత సమయం ఇవ్వాలని తెలిపాడు. ‘చాహల్‌ ఆశించిన మేర ఈ టోర్నీలో రాణించడం లేదు. అతడి స్థానంలో అవేశ్‌కు చోటు కల్పించాలి. ఇక రవి బిష్ణోయ్‌ని కచ్చితంగా కొనసాగించాలి’ అని ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ గంభీర్‌ విశ్లేషించాడు. అనారోగ్యం కారణంగా పాక్‌తో మ్యాచ్‌కు దూరమైన  అవేశ్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాడు.

మరోవైపు టీమ్‌ఇండియాకు బౌలింగ్‌ బలహీనత ప్రతికూలంగా మారింది. బుమ్రా, హర్షల్‌ ముందే దూరమవడం, మధ్యలో జడేజా గాయంతో నిష్క్రమించడంతో కావాల్సినన్ని బౌలింగ్‌ వనరులు జట్టుకు లేకుండా పోయాయి. పాక్‌తో గత మ్యాచ్‌లో ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఈ నేపథ్యంలో శ్రీలంకపై సరైన ప్రణాళికలతో రోహిత్‌ సేన బరిలోకి దిగి.. విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని