IND vs NZ: చాహల్‌ విషయంలో హార్దిక్‌ నిర్ణయం సరైంది కాదు: గంభీర్‌

భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో టీ20లో బౌలర్‌ యుజ్వేంద్ర చాహల్‌కు కేవలం రెండు ఓవర్లే అవకాశం ఇవ్వడాన్ని భారత మాజీ బ్యాటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తప్పుబట్టాడు.

Published : 30 Jan 2023 15:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కివీస్‌తో జరిగిన రెండో టీ20లో అద్భుతమైన బౌలింగ్‌తో రాణించిన యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనపెట్టి దీపక్‌ హుడాతో నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్ చేయించడాన్ని భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తప్పుబట్టాడు. చాహల్‌తో కేవలం రెండు ఓవర్లే బౌలింగ్‌ చేయించడం సరైన నిర్ణయం కాదన్నాడు. భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో టీ20లో చాహల్‌ రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేశాడు. అయినప్పటికీ కీలకమైన న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్‌ అలెన్‌ వికెట్ పడగొట్టి రెండు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన చాహల్‌తో కేవలం రెండు ఓవర్లే బౌలింగ్‌ చేయించడంపై గంభీర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘‘టీ20 ఫార్మాట్‌లో చాహల్‌ నంబర్‌ వన్‌ స్పిన్నర్‌. కివీస్‌తో రెండో టీ20లో కీలకమైన ఫిన్‌ అలెన్‌ వికెట్ పడగొట్టి అద్భుతంగా రాణించాడు. అతడితో  కేవలం రెండు ఓవర్లే బౌలింగ్‌ చేయించడం సరైన నిర్ణయం కాదు. అర్ష్‌దీప్‌, శివం మావి వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం తప్పుకాదు. కానీ చాహల్‌కు కనీసం ఆఖరి ఓవర్లోనైనా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాల్సింది. ఈ విషయంలో హార్దిక్‌ ట్రిక్‌ మిస్సయ్యాడు. దీపక్‌ హుడా కూడా ఒక వికెట్‌ పడగొట్టాడు. అయితే చాహల్‌ను పక్కన పెట్టి దీపక్‌తో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’’ అని గంభీర్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని