Gautam Gambhir: ఆ గొడవతో స్కూల్‌ నుంచి రెండు నెలలు సస్పెండయ్యా: గంభీర్‌

స్కూల్లో చదివే రోజుల్లో ఓ క్రికెట్‌ టీమ్‌తో గొడవ జరిగితే రెండు నెలలు సస్పెండయ్యానని చెప్పాడు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌...

Published : 20 Mar 2022 13:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్కూల్లో చదివే రోజుల్లో ఓ క్రికెట్‌ టీమ్‌తో గొడవ జరిగితే రెండు నెలలు సస్పెండయ్యానని చెప్పాడు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌. ముక్కుసూటి తనం కలిగిన గంభీర్‌ మైదానంలో ప్రత్యర్థులతోనూ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తుంటాడనే సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన అతడు మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘నేను స్కూల్లో చాలా గొడవలు పడేవాడిని. అలా 12వ తరగతిలో ఉండగా ఒక టోర్నమెంట్‌లో భాగంగా వేరే కళాశాలకు వెళ్లాం. అక్కడ ప్రత్యర్థి జట్టుతో గొడవ జరిగితే రెండు నెలలు సస్పెండయ్యా. అప్పుడు నాకు ఇచ్చిన ‘అత్యుత్తమ విద్యార్థి’ బ్యాడ్జ్ కూడా వెనక్కి తీసుకున్నారు. పాఠశాల చివరి దశలో ఏ విద్యార్థి అయినా రోజూ తరగతులకు వెళ్లాలనుకుంటాడు. నేను మాత్రం సస్పెండై ఇంట్లో కూర్చున్నా. తర్వాత నేరుగా బోర్డు పరీక్షలకే హాజరయ్యా. అదే సమయంలో రంజీ క్రికెట్‌ కూడా ఆడేవాడిని’ అని గంభీర్‌ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

అలాగే ఒకసారి ‘ఒమన్‌ హౌజ్‌’ అనే పెద్ద బంగ్లాలో ఉండగా.. ఆ ఇంట్లోని అద్భుతమైన చిత్రపటాన్ని కూడా నాశనం చేసినట్లు ఈ మాజీ ఓపెనర్‌ పేర్కొన్నాడు. అలా చేయడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసివచ్చిందని చెప్పాడు. ఆ ఇంటి యజమాని ఒమన్‌ నుంచి ఆ చిత్రపటాన్ని తెప్పించాడని.. తాను నాశనం చేయడం చూసి బోరున విలపించినట్లు గంభీర్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని