IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌లో ఆ జట్టు మాజీ ఆటగాళ్లు క్రిస్‌గేల్, డివిలియర్స్ సందడి చేశారు. గేల్ స్టెప్పులకు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL 2023) సందర్భంగా ఇటీవల ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కార్యక్రమంలో ఆర్సీబీ మాజీ ఆటగాళ్లు క్రిస్‌గేల్ (Chris Gayle), ఏబీ డెవిలియర్స్(AB de Villiers) సందడి చేశారు. ఈ సందర్భంగా ఆటగాళ్లంతా మైదానంలో కవాతు చేశారు. గేల్, కోహ్లీ, ఏబీడీ త్రయం కవాతు చేస్తుండగా..స్టేడియంలోని ప్రేక్షకులు కోహ్లీ..కోహ్లీ అని అరుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గేల్ స్టెప్పులకు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. కార్యక్రమంలో ఫ్రాంఛైజీ నూతన జెర్సీనీ ఆవిష్కరించింది.
గేల్, కోహ్లీ, ఏబీడీ కలిసి 2017లో ఆర్సీబీ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడారు. 2018లో గేల్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. అతడు 2021లో ఆఖరి ఐపీఎల్ ఆడాడు. ఏబీడీ గతేడాది అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. గతేడాది ఆర్సీబీ ప్లే ఆఫ్స్ వరకు వెళ్లింది. కానీ క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడి ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఏప్రిల్ 2న మంబయి ఇండియన్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్