అమ్మ.. డాన్స్‌ చేయాలంటే: గబ్బర్‌

టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడు. తనకు సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటాడు. గాయాలైనా.. కష్టాలైనా నవ్వుతూ ఎదుర్కొనే మనస్తత్వం అతడిది. కరోనా వైరస్‌....

Published : 14 Jul 2020 01:41 IST

గబ్బర్‌ను కవ్వించిన యుజువేంద్ర చాహల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడు. తనకు సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటాడు. గాయాలైనా.. కష్టాలైనా నవ్వుతూ ఎదుర్కొనే మనస్తత్వం అతడిది. కరోనా వైరస్‌ ముప్పుతో అంతర్జాతీయ క్రికెట్‌ స్తంభించిన సంగతి తెలిసిందే. అయితే అందివచ్చిన ఈ అవకాశాన్ని క్రికెటర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒకపక్క ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూనే మరోవైపు కుటుంబ సభ్యులతో సమయం ఆస్వాదిస్తున్నారు.

తాజాగా గబ్బర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. అందులో ఓ పంజాబీ పాటకు తన కొడుకు జొరావర్‌తో కలిసి చిందులు వేశాడు. భార్య ఆయేషాను సైతం తనతో కలిసి కాలు కదపాలని కోరాడు. సోఫాలో హాయిగా కూర్చున్న ఆమె రానంటే రానని మొండికేసింది. దాంతో... ‘భార్యను ఒప్పించాలంటే కొడుకు మద్దతు ఉండాల్సిందే’ అని ధావన్‌ అన్నాడు. కానీ కథ ఇక్కడితోనే అయిపోలేదు!

టీమ్‌ఇండియా చిలిపి కుర్రాడు యుజువేంద్ర చాహల్‌ వేలు పెట్టేశాడు. ‘భయ్యా.. వదిన డాన్స్‌ చేయడం మొదలుపెడితే జోరూ బేబీ అటు వైపుంటాడు (అంటే గబ్బర్‌ జోడీ ఎవరూ ఉండరని) మరి’ అంటూ కవ్వించేశాడు. ప్రస్తుతం ఈ సంభాషణ ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని