Updated : 25 Jun 2022 02:57 IST

సిరీసే లక్ష్యంగా..

నేడే లంకతో భారత్‌ రెండో టీ20

మధ్యాహ్నం 2 నుంచి

దంబుల్లా: శ్రీలంకతో తొలి టీ20లో స్ఫూర్తిదాయక విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. శనివారం రెండో టీ20లో లంకతో మన జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మూడు టీ20ల సమరాన్ని మరో మ్యాచ్‌ మిగిలుండగానే దక్కించుకోవాలని హర్మన్‌ప్రీత్‌ బృందం భావిస్తోంది. అయితే టాప్‌ఆర్డర్‌ గాడిలో పడడం భారత్‌కు కీలకం. తొలి మ్యాచ్‌లో విఫలమైన స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానతో పాటు సబ్బినేని మేఘన రాణించాల్సి ఉంది. మిథాలీరాజ్‌ను దాటి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచేందుకు హర్మన్‌ప్రీత్‌కు మరో 24 పరుగులు అవసరం. ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిథాలీ 2364 పరుగులు చేయగా.. హర్మన్‌ప్రీత్‌ 2341 పరుగులు సాధించింది. జులై 28న బర్మింగ్‌హామ్‌లో ఆరంభం కానున్న కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌ కూడా ఉన్న నేపథ్యంలో లంకపై సిరీస్‌ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తోంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని