- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
బోణీ కొట్టిన భారత్
పల్లెకెలె: శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. శుక్రవారం తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన లంక 48.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. దీప్తిశర్మ (3/25), రేణుక సింగ్ (3/29) ప్రత్యర్థిని కట్టడి చేశారు. టీమ్‌ఇండియా తరఫున ఎనిమిది మంది బౌలింగ్ చేయడం విశేషం. భారత్ 38 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఛేదనలో భారత్ 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (4), యాస్తిక (1) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఈ స్థితిలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (44; 63 బంతుల్లో 3×4).. షెఫాలివర్మ (35; 40 బంతుల్లో 1×4, 2×6), హర్లీన్ డియోల్ (34; 40 బంతుల్లో)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. హర్మన్, హర్లీన్, రిచా (6) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో 138/6తో టీమ్‌ఇండియా ఇబ్బందుల్లో పడ్డట్టు అనిపించింది. ౖకానీ దీప్తి (22 నాటౌట్).. పూజ (21 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించింది. లంక బౌలర్లలో ఇనోక(4/39) రాణించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
-
Viral-videos News
Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
-
World News
Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
-
India News
అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
-
Sports News
DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
-
Crime News
Dalit Boy Death: 23రోజుల్లో 6 ఆస్పత్రులు తిప్పినా.. దక్కని బాలుడి ప్రాణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
- Balakrishna: నమ్మకంతో గెలిపిస్తే.. నీలిచిత్రాలు చూపిస్తారా?.. ఎంపీ మాధవ్‌పై బాలకృష్ణ ఫైర్
- Heart Health: చేపలతో గుండెకెంత మేలో తెలుసా..?
- Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
- డేంజర్ జోన్లో రాష్ట్ర ప్రభుత్వం
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
- Biden: దగ్గిన చేతితోనే పెన్ను ఇచ్చి, కరచాలనం చేసి..!