Surya kumar yadav: సూర్యకుమారా.. అవేం షాట్లయ్యా..!

క్రీజు వదిలి ముందుకు వచ్చి పిచ్‌ మీద నృత్యం చేస్తున్నట్లుగా షాట్‌ ఆడితే అది కాస్తా సిక్సర్‌.. పిచ్‌కు దూరంగా వెళ్తున్న వైడ్‌ బంతిని వెంటాడుతూ బ్యాట్‌ను తాకిస్తే అది కూడా బౌండరీని దాటేసింది..

Updated : 03 Oct 2022 07:56 IST

క్రీజు వదిలి ముందుకు వచ్చి పిచ్‌ మీద నృత్యం చేస్తున్నట్లుగా షాట్‌ ఆడితే అది కాస్తా సిక్సర్‌.. పిచ్‌కు దూరంగా వెళ్తున్న వైడ్‌ బంతిని వెంటాడుతూ బ్యాట్‌ను తాకిస్తే అది కూడా బౌండరీని దాటేసింది.. నడుం కంటే ఎత్తులో వచ్చిన ఫుల్‌టాస్‌ బంతిని కొడితే అదేమో స్టాండ్స్‌లో పడింది.. ఇక షార్ట్‌ పిచ్‌ బంతిని వికెట్‌ వెనక్కి ఆడితే అది కూడా నేరుగా వెళ్లి బౌండరీ అవతల తేలింది.. ఇలా సూర్యకుమార్‌ యాదవ్‌ ఏ షాట్‌ ఆడితే బంతి గమ్యం బౌండరీనే అయింది. భీకర ఫామ్‌లో ఉన్న అతడికి బంతులు ఎలా వెయ్యాలో తెలియని అయోమయంలో పడిపోయారు సఫారీ బౌలర్లు. ఏదో సుడి ఉన్నట్లుగా అతను ఏ షాట్‌ ఆడినా పరుగులు వచ్చాయి. మ్యాచ్‌లో రాహుల్‌, రోహిత్‌, కోహ్లి కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రత్యర్థి ఆటగాడు మిల్లర్‌ విధ్వంసక శతకం సాధించాడు. డికాక్‌ కూడా ధాటిగా ఆడాడు. కానీ ఆదివారం సంచలన ఇన్నింగ్స్‌ అంటే సూర్యకుమార్‌దే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని