IND Vs SA: భారత్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో అనుకోని అతిథి

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 నడుస్తుండగా అనూహ్య ఉదంతం చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ పూర్తయి ఎనిమిదో ఓవర్‌ మొదలు కాబోతున్న సమయంలో ఓ పాము జరజరా పాకుతూ గువాహాటి స్టేడియంలోకి వచ్చేసింది. దీంతో ఆటను ఆపేసి క్రికెటర్లలంతా ఆ పాము వైపే చూస్తుండిపోయారు. 

Published : 03 Oct 2022 08:48 IST

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 నడుస్తుండగా అనూహ్య ఉదంతం చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ పూర్తయి ఎనిమిదో ఓవర్‌ మొదలు కాబోతున్న సమయంలో ఓ పాము జరజరా పాకుతూ గువాహాటి స్టేడియంలోకి వచ్చేసింది. దీంతో ఆటను ఆపేసి క్రికెటర్లలంతా ఆ పాము వైపే చూస్తుండిపోయారు. అభిమానులకు కూడా ఏం జరిగిందో వెంటనే అర్థం కాలేదు.

దీంతో మైదానంలోకి హుటాహుటిన వెళ్లిన సిబ్బంది పామును పట్టి బయటకు తీసుకెళ్లిపోయారు. మైదానంలోకి కుక్కలు రావడం సాధారణమే కానీ.. ఇలా పాము రావడం అనూహ్యం. దీంతో కాసేపు కెమెరాలన్ని దాని చుట్టూనే తిరిగాయి. ఇదొక్కటే కాదు మ్యాచ్‌లో నిర్వాహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దక్షిణాఫ్రికా ఛేదనలో దీపక్‌ చాహర్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ తొలి బంతి వేసిన తర్వాత స్టేడియంలోని నాలుగు ఫ్లడ్‌ లైట్లలో ఒక ఫ్లడ్‌లైట్‌ ఆగిపోయింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. ఆటకు 18 నిమిషాలు అంతరాయం కలిగింది.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని