Fifa World Cup: అద్భుతమైన గోల్‌ చేసినా.. సంబరాలకు దూరం..

అద్భుతమైన గోల్‌ చేసిన స్విట్జర్లాండ్‌  స్ట్రైకర్‌ బ్రీల్‌ ఎంబోలో సంబరాలకు దూరంగా ఉన్నాడు. సహచర ఆటగాళ్లంతా ఆనందంలో గంతులు వేస్తున్నా.. ఆయన మాత్రం తలదించుకొని ఉన్నాడు. ఎందుకో తెలుసా?

Updated : 24 Nov 2022 19:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిఫా వరల్డ్‌ కప్‌లో గ్రూప్‌ జీ దశలో స్విట్జర్లాండ్‌, కామెరూన్‌ జట్ల మధ్య హోరా హోరీగా పోరు జరుగుతోంది. అనూహ్యంగా స్విస్‌ స్ట్రైకర్‌ బ్రీల్‌ ఎంబోలో అద్భుతమైన గోల్‌ చేశాడు. మ్యాచ్‌లో ఇదే మొదటి గోల్‌. దీంతో జట్టంతా ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయింది. అయితే గోల్‌ చేసిన బ్రీల్‌ మాత్రం కదలకుండా అక్కడే ఉండిపోయాడు. గోల్‌ చేసిన ఆనందం ఏమాత్రం ఆయన ముఖంలో కనిపించలేదు. పైగా, తప్పుచేసిన వాడిలా ముఖం దించేశాడు. ఎందుకో తెలుసా?

బ్రీల్‌ ఎంబోలో కామెరూన్‌ రాజధాని యావొండేలో జన్మించాడట. ఆ తర్వాత అతడి తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి, ఎంబోలోను తీసుకొని  స్విట్జర్లాండ్‌ బాసెల్‌కు వచ్చి స్థిరపడ్డారు. కామెరూన్‌లో పుట్టినప్పటికీ ఆయన విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది. దీంతో జన్మనిచ్చిన దేశంపైనే గోల్‌ కొట్టి సంబరాలు చేసుకోవడం ఏంటి? అనుకున్నాడేమో.. సహచర ఆటగాళ్లంతా ఆనందంతో గంతులేస్తున్నా.. బ్రీల్‌ మాత్రం వారికి దూరంగా ఉన్నాడు.

స్విట్జర్లాండ్‌దే విజయం


హోరోహోరీగా సాగిన పోరులో చివరికి స్విట్జర్లాండే విజయం సాధించింది. అది కూడా 48వ నిమిషంలో బ్రీల్‌‌ ఎంబోలో చేసిన ఏకైక గోల్‌తో స్విస్‌ విజయం సాధించడం గమనార్హం. మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధం ప్రారంభమైన కొద్ది సేపటికే బీల్‌ ఎంబోలో అద్భుత గోల్‌ చేయడంతో 1-0 తేడాతో కామెరూన్‌పై స్విస్‌ విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు