IND Vs BAN : రెండో వన్డేలో రోహిత్ శర్మకు గాయం.. స్కానింగ్ కోసం ఆస్పత్రికి
బంగ్లాతో రెండో వన్డేలో(IND Vs BAN) స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ(Rohit sharma) బొటన వేలికి గాయమైంది.
మిర్పూర్ : బంగ్లాతో రెండో వన్డే(IND Vs BAN)లో భారత్(Team India)కు షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) గాయం కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి బొటన వేలికి గాయమైంది(Injury). వెంటనే బీసీసీఐ(BCCI) మెడికల్ టీమ్ అతడిని స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించింది. అతడి స్థానంలో మైదానంలోకి రజత్ పటిదార్ వచ్చాడు.
బంగ్లా ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సిరాజ్ వేసిన నాలుగో బంతికి అనముల్ భారీ షాట్ ఆడాడు. సెకండ్ స్లిప్‌లో ఉన్న రోహిత్ దాన్ని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తుండగా అతడి బొటన వేలికి తీవ్ర గాయమైంది. ‘కెప్టెన్ రోహిత్ బొటన వేలికి గాయమైంది. స్కానింగ్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. బీసీసీఐ వైద్య సిబ్బంది అతడి పరిస్థితిని అంచనా వేస్తోంది’ అని రోహిత్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. స్కానింగ్ అనంతరం మైదానానికి వచ్చిన రోహిత్.. డగౌట్‌లో కనిపించాడు. అయితే రోహిత్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చేది అనుమానంగానే ఉంది.
ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్ రేసులో నిలవాలంటే భారత్ తప్పక ఈ వన్డే గెలవాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Vijay Mallya: అప్పు చెల్లించకుండా.. విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు: మాల్యాపై సీబీఐ తాజా ఛార్జ్‌షీట్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
XBB.1.16: కొవిడ్ తాజా విజృంభణకు ఈ వేరియంట్ కారణమా..?
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
-
General News
AP High court: ఏపీ హైకోర్టు తరలింపు న్యాయస్థానాల పరిధిలోనే: కేంద్ర ప్రభుత్వం
-
Sports News
Rohit - IPL: ఐపీఎల్లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్ శర్మ