BBL: 5.5 ఓవర్లలో 15కే ఆలౌట్‌.. సిడ్నీ థండర్‌ చెత్త రికార్డు

బిగ్‌ బాష్‌ లీగ్‌ టీ20 టోర్నీలో పెను సంచలనం నమోదైంది. అలెక్స్‌ హేల్స్‌, రిలీ రొసో లాంటి అంతర్జాతీయ స్టార్లున్న సిడ్నీ థండర్‌ జట్టు.. కేవలం 15 పరుగులకే కుప్పకూలి క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.

Updated : 17 Dec 2022 09:56 IST

టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోరు

సిడ్నీ: బిగ్‌ బాష్‌ లీగ్‌ టీ20 టోర్నీలో పెను సంచలనం నమోదైంది. అలెక్స్‌ హేల్స్‌, రిలీ రొసో లాంటి అంతర్జాతీయ స్టార్లున్న సిడ్నీ థండర్‌ జట్టు.. కేవలం 15 పరుగులకే కుప్పకూలి క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రొఫెషనల్‌ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోరు. 2019లో చెక్‌ రిపబ్లిక్‌పై టర్కీ 8.3 ఓవర్లలో 21 పరుగులకే ఆలౌటై నెలకొల్పిన ప్రపంచ రికార్డును సిడ్నీ థండర్‌ బద్దలు కొట్టింది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్‌ కేవలం 5.5 ఓవర్లలోనే ముగిసిపోవడం విశేషం. టీ20ల్లో అతి తక్కువ ఓవర్లలో ఇన్నింగ్స్‌ను ముగించిన జట్టుగానూ థండర్‌ రికార్డులకెక్కింది. మొదట స్ట్రైకర్స్‌ 9 వికెట్లకు 139 పరుగులు చేయగా.. హెన్రీ థార్న్‌టన్‌ (2.5-1-3-5), వెస్‌ అగార్‌ (2-0-6-4)ల ధాటికి థండర్‌ చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంది. ఆ జట్టులో నలుగురు డకౌట్‌ కాగా.. ముగ్గురు ఒక్క పరుగుకే ఔటయ్యారు. 4 పరుగులు చేసిన డాగెట్‌ టాప్‌స్కోరర్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని