11.2 ఓవర్లలో..

ఎలాంటి డ్రామా లేదు. నాలుగో రోజు పోరాడిన బంగ్లాకు ఆఖరి రోజు టీమ్‌ఇండియా ఎలాంటి అవకాశం లేదు. కేవలం 11.2 ఓవర్లలోనే మిగతా నాలుగు వికెట్లు పడగొట్టి తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది.

Published : 19 Dec 2022 04:22 IST

చివరి రోజు బంగ్లా ఇన్నింగ్స్‌కు తెర
తొలి టెస్టులో భారత్‌ ఘనవిజయం

ఎలాంటి డ్రామా లేదు. నాలుగో రోజు పోరాడిన బంగ్లాకు ఆఖరి రోజు టీమ్‌ఇండియా ఎలాంటి అవకాశం లేదు. కేవలం 11.2 ఓవర్లలోనే మిగతా నాలుగు వికెట్లు పడగొట్టి తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది.

టీమ్‌ఇండియా లాంఛనాన్ని ముగించింది. ఆఖరి రోజు బంతితో విజృంభించిన భారత్‌ మొదటి టెస్టులో 188 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. 513 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 272/6తో ఆదివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లా.. ఎంతోసేపు నిలవలేదు. మరో 11.2 ఓవర్లలో మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 324 పరుగులకు ఆలౌటైంది. షకిబ్‌ 84 పరుగులు చేశాడు. అక్షర్‌ పటేల్‌ (4/77), కుల్‌దీప్‌ యాదవ్‌ (3/73) బంతితో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 404 పరుగులు చేయగా.. బంగ్లా 150కే కుప్పకూలింది. భారత్‌ 258/2 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టడంతోపాటు విలువైన పరుగులు సాధించిన కుల్‌దీప్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును అందుకున్నాడు. ఈ విజయంతో టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకుంది. రెండో టెస్టు ఈ నెల 22న మొదలవుతుంది.

బంగ్లా చకచకా: నాలుగో రోజు పోరాటం చూశాక ఆఖరి రోజు బంగ్లా ఎలా ఆడుతుందన్న ఆసక్తి ఏర్పడింది. కానీ భారత బౌలర్లు ఆ జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చకచకా మిగతా నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ముగించారు. మెహదీ హసన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ కొనసాగించిన షకిబ్‌.. ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. ఎటాకింగ్‌ గేమ్‌తో ఎడా పెడా ఫోర్లు, సిక్స్‌లు కొట్టాడు. మెహదీ హసన్‌ (13) మాత్రం త్వరగా పెవిలియన్‌ చేరాడు. ఓవర్‌నైట్‌ స్కోరుకు కేవలం నాలుగు పరుగులు జోడించిన అతణ్ని.. ఆఖరి రోజు మూడో ఓవర్లో సిరాజ్‌ ఔట్‌ చేశాడు. అక్షర్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో షకిబ్‌ అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే స్లాగ్‌ స్వీప్‌కు ప్రయత్నించిన అతణ్ని బంగ్లా స్కోరు 320 వద్ద కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేశాడు. ఎబాదత్‌ (0)ను కూడా కుల్‌దీప్‌ ఔట్‌ చేయగా.. తైజుల్‌ (0)ను అక్షర్‌ బౌల్డ్‌ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్‌ ముగిసింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 404;

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 150

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 258/2 డిక్లేర్డ్‌

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: నజ్ముల్‌ (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 67; జాకిర్‌ హసన్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 100; యాసిర్‌ అలీ (బి) అక్షర్‌ 5; లిటన్‌ దాస్‌ (సి) ఉమేశ్‌ (బి) కుల్‌దీప్‌ 19; ముష్ఫికర్‌ (బి) అక్షర్‌ 23; షకిబ్‌ (బి) కుల్‌దీప్‌ 84; నురుల్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 3; మెహదీ హసన్‌ (సి) ఉమేశ్‌ (బి) సిరాజ్‌ 13; తైజుల్‌ (బి) అక్షర్‌ 4; ఎబాదత్‌ (సి) శ్రేయస్‌ (బి) కుల్‌దీప్‌ 0; ఖాలెద్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (113.2 ఓవర్లలో ఆలౌట్‌) 324; వికెట్ల పతనం: 1-124, 2-131, 3-173, 4-208, 5-234, 6-238, 7-283, 8-320, 9-324; బౌలింగ్‌: సిరాజ్‌ 19-4-67-1; ఉమేశ్‌ యాదవ్‌ 15-3-27-1; అశ్విన్‌ 23-7-75-1; అక్షర్‌ పటేల్‌ 32.2-10-77-4; కుల్‌దీప్‌ 20-3-73-3

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని