FIFA World Cup 2022: ‘బిష్ఠ్‌’తో మెస్సి .. అందుకే అలా..

ఫైనల్లో ఫ్రాన్స్‌పై విజయం తర్వాత ప్రపంచకప్‌ను అందుకోవడానికి ముందు అర్జెంటీనా కెప్టెన్‌ లియొనెల్‌ మెస్సి ప్రత్యేక వస్త్రాన్ని ధరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Updated : 29 Oct 2023 12:04 IST

దోహా: ఫైనల్లో ఫ్రాన్స్‌పై విజయం తర్వాత ప్రపంచకప్‌ను అందుకోవడానికి ముందు అర్జెంటీనా కెప్టెన్‌ లియొనెల్‌ మెస్సి ప్రత్యేక వస్త్రాన్ని ధరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వేదికపై ఫిఫా అధ్యక్షుడు ఇన్‌ఫాంటినో సమక్షంలో ఖతార్‌ చక్రవర్తి షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ ఈ వస్త్రాన్ని అతనికి తొడిగించారు. మరి అసలు ఆ వస్త్రం ఏమిటీ అంటే.. అది ఖతార్‌ సంప్రదాయ ‘బిష్ఠ్‌’. ప్రత్యేక సందర్భాల్లో రాజ కుటుంబీకులు, రాజకీయ నేతలు, మత గురువులు, ధనికులు తదితరులు దీన్ని ధరిస్తారు. దీన్ని వేసుకోవడం వల్ల హుందాగా, ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రపంచకప్‌ అందుకోవడం మెస్సికి ప్రత్యేక సందర్భం కాబట్టి అతనికి దీన్ని అందించారు.

అరబ్‌ యుద్ధ వీరులకు, రాజు వంశస్థులకూ ఈ వస్త్రాన్ని బహూకరిస్తారని కొంతమంది చెబుతున్నారు. కప్పు గెలిచిన మెస్సి.. ఫుట్‌బాల్‌ కింగ్‌గా మారాడు కాబట్టి అతనికి దీన్ని ప్రత్యేకంగా అందించారని అంటున్నారు. ‘‘అధికారిక, ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ వస్త్రాన్ని ధరిస్తారు. ఇది మెస్సి సంబరాల సందర్భం. అందుకే అతనికి దీన్ని బహూకరించాం. అరబ్‌, ముస్లిమ్‌ సంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు ఈ మెగా టోర్నీ మాకు అవకాశాన్ని కల్పించింది’’ అని ఖతార్‌ టోర్నీ నిర్వాహక కమిటీ కార్యదర్శి హసన్‌ అల్‌ థవాడి పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని