అక్షర్‌కు కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకు

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ టెస్టుల్లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బౌలింగ్‌ జాబితాలో అక్షర్‌ 20 స్థానాలు మెరుగై 18వ ర్యాంకులో నిలిచాడు.

Published : 22 Dec 2022 04:11 IST

దుబాయ్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ టెస్టుల్లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బౌలింగ్‌ జాబితాలో అక్షర్‌ 20 స్థానాలు మెరుగై 18వ ర్యాంకులో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో    5 వికెట్లు తీసిన అక్షర్‌.. 650 పాయింట్లతో టాప్‌-20 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సత్తాచాటి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్న కుల్దీప్‌యాదవ్‌ 19 స్థానాలు మెరుగై 49వ ర్యాంకు సాధించాడు. బుమ్రా 4, ఆర్‌.అశ్విన్‌ 5వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్‌లో పుజారా 10 స్థానాలు మెరుగై 16వ ర్యాంకు చేరుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 11 స్థానాలు మెరుగై 26వ ర్యాంకు దక్కించుకున్నాడు. రిషబ్‌ పంత్‌ 6, రోహిత్‌శర్మ 9, విరాట్‌ కోహ్లి 12వ స్థానాల్లో కొనసాగుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని