IND Vs BAN: ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’.. పుజారాకు ఎందుకు?
బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల పోరులో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా పుజారాను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. 74 సగటుతో 222 పరుగులతో అతను అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు.
బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల పోరులో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా పుజారాను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. 74 సగటుతో 222 పరుగులతో అతను అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు. అందులో ఓ సెంచరీ, అర్ధశతకం ఉన్నాయి. కానీ ఇవి రెండూ తొలి మ్యాచ్ (90, 102 నాటౌట్)లో సాధించినవే. రెండో టెస్టులో అతని స్కోర్లు వరుసగా 24, 6 మాత్రమే. ఈ మ్యాచ్‌లో అతను పూర్తిగా విఫలమయ్యాడు. జట్టును ఆదుకోవాల్సింది పోయి వికెట్ పారేసుకుని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. దీంతో అతనికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు ఎలా ఇస్తారనే ప్రశ్నలు తలెత్తాయి.
ఇదే సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ రెండు మ్యాచ్‌ల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానం (202)లో ఉన్నాడు. అతని సగటు 101. అతను జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. రెండో టెస్టులో (87, 29 నాటౌట్)నూ నిలకడైన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌తో కలిసి కీలక భాగస్వామ్యంతో జట్టుకు ఆధిక్యం దక్కేలా చూశాడు. ఇక ఛేదనలో ఓటమి భయం వెంటాడుతుండగా.. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి తడబాటు లేకుండా జట్టును విజయతీర్చాలకు చేర్చాడు. దీంతో శ్రేయస్‌కు కాకుండా పుజారాకు ఆ అవార్డు ఎందుకు ఇచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్ ‘ఆత్మీయ సందేశం’
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి
-
Sports News
Gambhir: మాజీ ఆటగాళ్లకు మసాలా అవసరం.. కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలిచిన గంభీర్
-
India News
Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్‌కు కాల్స్..!
-
India News
CUET-PG 2023: సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ ఇదే.. UGC ఛైర్మన్ ట్వీట్!
-
General News
Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం