IPL: సొమ్ముతో నా ఆట మారదు: కామెరాన్ గ్రీన్
ఐపీఎల్‌లో తనకు భారీ ధర పలకడం తనను లేదా తన ఆటను మార్చదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ అన్నాడు. 23 ఏళ్ల గ్రీన్ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడు.
మెల్‌బోర్న్: ఐపీఎల్‌లో తనకు భారీ ధర పలకడం తనను లేదా తన ఆటను మార్చదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ అన్నాడు. 23 ఏళ్ల గ్రీన్ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడు. తాజా వేలంలో ముంబయి ఇండియన్స్ అతణ్ని రూ.17.5 కోట్లకు కొనుక్కుంది. ‘‘ఇంత పెద్ద మొత్తం పొందాల్సిన స్థాయిలో నేనేమీ చేయలేదు. నా పేరును వేలంలో నమోదు చేసుకున్నానంతే. అనుకోకుండా అంత పెద్ద ధర పలికింది. అది వ్యక్తిగా నన్ను కానీ.. నా ఆటను కానీ మార్చదు. నేను పెద్దగా మారనని ఆశిస్తున్నా’’ గ్రీన్ అన్నాడు. తన లాంటి ఆల్‌రౌండర్ సుదీర్ఘకాలం ఆడాలంటే పనిభార నిర్వహణ ముఖ్యమని చెప్పాడు. ‘‘బ్యాటింగ్, బౌలింగ్‌లు రెండింటిలోనూ సమానంగా కృషి చేయడం చాలా కష్టం. అందులో ఏదో ఒకదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండు విభాగాల్లోనూ తీవ్రంగా శ్రమిస్తే ఒత్తిడి పెరుగుతుంది’’ అని గ్రీన్ అన్నాడు. మ్యాచ్‌కు ముంద]ు తన ప్రాధాన్యత బ్యాటింగ్‌కే ఉంటుందని, మ్యాచ్ రోజు బౌలింగ్‌పై ఎక్కువ దృష్టిపెడతానని గ్రీన్ చెప్పాడు. గ్రీన్ దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో సోమవారం అయిదు వికెట్లు పడగొట్టి సత్తా చాటుకున్నాడు. టెస్టు క్రికెట్లో అతడికిదే తొలి అయిదు వికెట్ల ఘనత.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: వారి ఆటతీరు.. టాప్‌ఆర్డర్‌కు గుణపాఠం: సౌరభ్ గంగూలీ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Harishrao: ఏపీ నేతలకు మాటలెక్కువ.. చేతలు తక్కువ: హరీశ్‌రావు
-
India News
MHA: మణిపుర్ హింసాత్మక ఘటనలు..! శాంతి స్థాపనకు కమిటీ ఏర్పాటు
-
General News
Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు
-
General News
KTR: ఈ-గవర్నెన్స్‌లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: మంత్రి కేటీఆర్