Shikhar Dhawan: ధావన్‌ కథ ముగిసినట్లేనా?

టీ20లకు ఎప్పుడో దూరమైనప్పటికీ.. వన్డేల వరకు మళ్లీ జట్టులో చోటు దక్కించుకుని, కొన్ని సిరీస్‌ల్లో కెప్టెన్‌గానూ వ్యవహరించిన సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు లంకతో వన్డేలకు జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు.

Updated : 28 Dec 2022 09:34 IST

టీ20లకు ఎప్పుడో దూరమైనప్పటికీ.. వన్డేల వరకు మళ్లీ జట్టులో చోటు దక్కించుకుని, కొన్ని సిరీస్‌ల్లో కెప్టెన్‌గానూ వ్యవహరించిన సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు లంకతో వన్డేలకు జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో విఫలమైన అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. 2023 ప్రపంచకప్‌ ఆడి కెరీర్‌ ముగిద్దామనుకున్న అతడికి నిరాశ తప్పలేదు. లంకతో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో ధావన్‌ కెరీర్‌ దాదాపు ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లంకతో టీ20లకు దూరంగా ఉన్న రోహిత్‌, కోహ్లి, రాహుల్‌ వన్డేల్లో మాత్రం ఆడనున్నారు. రోహిత్‌ సారథ్యంలోని జట్టుకు హార్దిక్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బంగ్లాపై డబుల్‌ సెంచరీ సాధించిన ఇషాన్‌ కిషన్‌ వన్డే సిరీస్‌కు ఏకైక స్పెషలిస్టు వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు. టీ20ల్లో అతడితో పాటు సంజు శాంసన్‌కు అవకాశం దక్కింది. స్పిన్నర్లు చాహల్‌, అక్షర్‌ పటేల్‌, సుందర్‌.. యువ పేసర్లు అర్ష్‌దీప్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. లంకతో మూడు టీ20లు జనవరి 3, 5, 7 తేదీల్లో ముంబయి, పుణె, రాజ్‌కోట్‌ల్లో జరుగుతాయి. 10, 12, 15 తేదీల్లో జరిగే వన్డేలకు గువాహటి, కోల్‌కతా, తిరువనంతపురం ఆతిథ్యమిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని