Adam Zampa: అయ్యయ్యో జంపా.. అశ్విన్‌లా మన్కడింగ్‌ చేయబోయి..

భారత ఆఫ్‌స్పిన్నర్‌ అశ్విన్‌ లాగే మన్కడింగ్‌ చేయబోయి బోల్తా కొట్టాడు ఆస్ట్రేలియా స్పిన్నర్‌ అడమ్‌ జంపా. బిగ్‌ బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగ్రేడ్స్‌ మధ్య మ్యాచ్‌లో జరిగిందిది.

Updated : 04 Jan 2023 09:33 IST

మెల్‌బోర్న్‌: భారత ఆఫ్‌స్పిన్నర్‌ అశ్విన్‌ లాగే మన్కడింగ్‌ చేయబోయి బోల్తా కొట్టాడు ఆస్ట్రేలియా స్పిన్నర్‌ అడమ్‌ జంపా. బిగ్‌ బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగ్రేడ్స్‌ మధ్య మ్యాచ్‌లో జరిగిందిది. జంపా.. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ కెప్టెన్‌. ఫాలోత్రూను పూర్తి చేసిన అతడు.. ఇక బంతిని వదిలినట్లే అనిపించిన దశలో హఠాత్తుగా వెనక్కి తిరిగి బెయిల్స్‌ను పడేశాడు. అప్పటికే నాన్‌స్ట్రైకర్‌ రోజర్స్‌ క్రీజును వదిలేశాడు. జంపా రనౌట్‌ కోసం అడగగా.. మైదానం అంపైర్‌ అది ఎందుకు ఔట్‌ కాదో చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత మూడో అంపైర్‌కు నివేదించాడు. మూడో అంపైర్‌ కూడా మైదానం అంపైర్‌ లాగే స్పందించాడు. జంపా భుజం నిట్ట నిలువు దశ నుంచి ముందుకెళ్లినందున నిబంధనల ప్రకారం బంతి వేసినట్లే భావించాలని చెబుతూ రోజర్స్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని