Hardik Pandya: నెహ్రా వల్లే నేనిలా..
కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపాడు హార్దిక్ పాండ్య. పొట్టి ఫార్మాట్లో ఇప్పుడు టీమ్‌ఇండియా పగ్గాలు అందుకున్నాడు.
రాజ్‌కోట్: కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపాడు హార్దిక్ పాండ్య. పొట్టి ఫార్మాట్లో ఇప్పుడు టీమ్‌ఇండియా పగ్గాలు అందుకున్నాడు. సారథిగా తాను విజయవంతం కావడంలో టైటాన్స్ కోచ్ నెహ్రాది కీలక పాత్ర అని హార్దిక్ తాజాగా వ్యాఖ్యానించాడు. ‘‘నెహ్రా రూపంలో గుజరాత్ టైటాన్స్‌కు మంచి కోచ్ ఉన్నాడు. నేను కెరీర్‌లో ఎదిగేందుకు నెహ్రా దోహదం చేశాడు. మేం భిన్న వ్యక్తులం కావొచ్చు. కానీ మా క్రికెటింగ్ బుర్రలు ఒక్కటే. అతడి వల్లే నేను మరింత మెరుగ్గా కెప్టెన్సీ చేయగలుగుతున్నా. నెహ్రా నాకు మద్దతుగా నిలిచాడు’’ అని హార్దిక్ అన్నాడు. అతడి సారథ్యంలోని జట్టు శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే జట్టును నడిపించడం తనకంత కష్టం కాలేదని హార్దిక్ అన్నాడు. ‘‘జట్టుకు సారథ్యం వహించడం నాకంత కష్టం కాలేదు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండడంతో నా పని తేలికైంది. నేను వారికేమీ చెప్పను. తమ జీవితాల్లో చాలా మంచి పనులు చేయడం వల్లే వాళ్లిక్కడ ఉన్నారు’’ అని చెప్పాడు. ఆత్మవిశ్వాసాన్నివ్వడమొక్కటే జట్టులో యువ ఆటగాళ్లకు తాను చేయగలిగిన సహాయమని హార్దిక్ అన్నాడు. కుర్రాళ్లు నేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నారని, దాని వల్ల తన ప్రయాణం తేలికవుతోందని చెప్పాడు. సూర్యకుమార్ తమకు చాలా ముఖ్య ఆటగాడని అన్నాడు. అతడు షాట్లు ఆడిన తీరు, ఆట స్వభావాన్ని మార్చిన తీరు లంక బౌలర్ల స్థైర్యాన్ని దెబ్బతీశాయని హార్దిక్ చెప్పాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా