Shubman gill: బల్లగుద్ది చెప్పాడు.. ఎన్నో ప్రశ్నలకు బదులిచ్చేశాడు!

బంగ్లాదేశ్‌పై మెరుపు డబుల్‌ సెంచరీ సాధించిన ఇషాన్‌ కిషన్‌ను కాదని ఓపెనింగ్‌లో చోటివ్వడమా? అసలు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడి వేగం

Updated : 19 Jan 2023 07:53 IST

బంగ్లాదేశ్‌పై మెరుపు డబుల్‌ సెంచరీ సాధించిన ఇషాన్‌ కిషన్‌ను కాదని ఓపెనింగ్‌లో చోటివ్వడమా? అసలు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడి వేగం సరిపోతుందా? దూకుడుకు మారుపేరైన ఎంతోమంది కుర్రాళ్లుండగా అతణ్ని ఆడించడం సరైందేనా?.. శ్రీలంక సిరీస్‌ ముంగిట శుభ్‌మన్‌ గిల్‌ విషయంలో ఇలా ఎన్నెన్నో సందేహాలు, ప్రశ్నలు! కానీ కొన్ని రోజులు గడిచాయో లేదో.. ఇప్పుడందరూ ప్రశ్నలు మానేసి, శుభ్‌మన్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. శ్రీలంకపై ఓ అర్ధశతకం, ఓ శతకంతో విమర్శకులకు బదులిచ్చిన శుభ్‌మన్‌.. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఏకంగా డబుల్‌ సెంచరీ బాదేసి ఔరా అనిపించాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ఓపెనర్‌ తనే అని ఈ ఇన్నింగ్స్‌తో అతను బల్లగుద్ది చెప్పాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అతను చాలా ప్రశ్నలకు బదులిచ్చేశాడనే చెప్పాలి.

సెంచరీ కొట్టిన వెంటనే డబుల్‌ సెంచరీ బాదడం అతడి సూపర్‌ ఫామ్‌కు, నిలకడకు రుజువైతే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు తగ్గట్లు వేగంగా ఆడలేడన్న విమర్శకు కూడా ఈ ఇన్నింగ్స్‌తోనే అతను సమాధానం చెప్పాడు. 150 నుంచి 200కు కేవలం 23 బంతుల్లోనే చేరుకోవడం.. డబుల్‌ సెంచరీ కష్టమనుకున్న దశలో వరుసగా మూడు సిక్సర్లు బాది ఆ మైలురాయిని చేరుకోవడం.. గిల్‌ దూకుడుకు నిదర్శనం. సంప్రదాయ షాట్లతోనే విధ్వంసం సృష్టించగలనని గిల్‌ ఉప్పల్‌లో చాటిచెప్పాడు. గత కొంత కాలంగా ధావన్‌, కేఎల్‌ రాహుల్‌ల వైఫల్యంతో ఓపెనింగ్‌ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న భారత్‌కు గిల్‌ రూపంలో పరిష్కారం దొరికింది. ఇషాన్‌ కూడా సత్తా చాటుకున్నప్పటికీ.. అతడికి కూడా నిలకడ లేమి సమస్య ఉంది. ఇషాన్‌ కూడా కుదురుకుంటే ప్రపంచకప్‌ వరకు బ్యాటింగ్‌ ఆర్డర్లో దిగువన ఆడొచ్చు. ప్రపంచకప్‌ తర్వాత రోహిత్‌ తప్పుకుంటే శుభ్‌మన్‌కు జోడీగా ఓపెనర్‌గా స్థిరపడడానికి అవకాశముంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని