IND Vs NZ: నవ్వులు పూయించిన రోహిత్‌ ప్రవర్తన

టాస్‌ సమయంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రవర్తన నవ్వులు పూయించింది. టాస్‌ గెలిచిన అతను ఏం ఎంచుకోవాలన్న విషయాన్ని మర్చిపోయాడు.

Updated : 22 Jan 2023 15:15 IST

రాయ్‌పుర్‌ వన్డే టాస్‌ సమయంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రవర్తన నవ్వులు పూయించింది. టాస్‌ గెలిచిన అతను ఏం ఎంచుకోవాలన్న విషయాన్ని మర్చిపోయాడు. రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ అడిగితే రోహిత్‌ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. బుర్ర గోక్కున్నాడు. టాస్‌ గెలిస్తే ఏం చేయాలని జట్టుతో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసుకోవడం కోసం అతను కాస్త సమయం తీసుకున్నాడు. కొన్ని క్షణాలు ఆలోచించి.. ఆ తర్వాత బౌలింగ్‌ చేస్తామని చెప్పాడు. దీంతో ప్రత్యర్థి కెప్టెన్‌ లేథమ్‌, శ్రీనాథ్‌, వ్యాఖ్యాత రవిశాస్త్రి నవ్వుకున్నారు. రోహిత్‌ కూడా వీళ్లతో కలిసి నవ్వాడు. ఆ సమయంలో మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తున్న సిరాజ్‌, షమితో పాటు భారత ఆటగాళ్లు కూడా నవ్వులు చిందించారు. ‘‘టాస్‌ గెలిస్తే ఏం చేయాలి అనే విషయంపై జట్టులో బాగా చర్చించాం. కానీ తీసుకున్న నిర్ణయాన్ని కాసేపు మర్చిపోయా. కఠిన పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కోవాలని అనుకున్నాం. మొదట బౌలింగ్‌ చేస్తాం’’ అని రోహిత్‌ చెప్పాడు. అతని మాటలను బట్టి చూస్తే బ్యాటింగ్‌కు బదులు బౌలింగ్‌ ఎంచుకున్నాడేమో అనిపించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని