మమ్మల్ని సంప్రదించరా?
డబ్ల్యూఎఫ్ఐ పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసేముందు తమను సంప్రదించకపోవడంపై రెజ్లరు నిరాశ వ్యక్తం చేశారు.
కమిటీ ఎంపికపై రెజ్లర్ల నిరాశ
దిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసేముందు తమను సంప్రదించకపోవడంపై రెజ్లరు నిరాశ వ్యక్తం చేశారు. రెజ్లర్ల నిరసన నేపథ్యంలో సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలపై విచారణ జరిపేందుకు క్రీడల మంత్రిత్వ శాఖ మేరీకోమ్ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, సరిత మోర్, సాక్షి మలిక్లు ఒకే రకమైన ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ‘‘పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసేముందు మమ్మల్ని సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. కానీ మమ్మల్ని సంప్రదించకపోవడం విచారకరం’’ అని వారు పేర్కొన్నారు. వాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్లను ట్యాగ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
srirama chandra: సింగర్ అసహనం.. ఫ్లైట్ మిస్సయిందంటూ కేటీఆర్‌కు విజ్ఞప్తి..!
-
India News
Temjen Imna Along: ‘నా పక్కన కుర్చీ ఖాళీగానే ఉంది’.. పెళ్లి గురించి మంత్రి ఆసక్తికర ట్వీట్
-
General News
TSPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు
-
Politics News
KTR: మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు: మంత్రి కేటీఆర్
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. అక్కడ టీమ్ఇండియాకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్
-
Movies News
Tollywood: విజయోత్సవం కాస్తా.. వివాదమైంది.. విమర్శల పాలైంది!