మెరిసిన స్మృతి, హర్మన్‌

ఓపెనర్‌ స్మృతి మంధాన (74 నాటౌట్‌;  51 బంతుల్లో 10×4, 1×6), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (56 నాటౌట్‌; 35 బంతుల్లో 8×4) అజేయ అర్ధసెంచరీలతో అదరగొట్టడంతో మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది

Published : 25 Jan 2023 01:45 IST

విండీస్‌పై భారత్‌ విజయం
ముక్కోణపు టీ20 సిరీస్‌

ఈస్ట్‌ లండన్‌ (దక్షిణాఫ్రికా): ఓపెనర్‌ స్మృతి మంధాన (74 నాటౌట్‌;  51 బంతుల్లో 10×4, 1×6), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (56 నాటౌట్‌; 35 బంతుల్లో 8×4) అజేయ అర్ధసెంచరీలతో అదరగొట్టడంతో మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 56 పరుగుల ఆధిక్యంతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 167 పరుగులు సాధించింది. స్మృతి, హర్మన్‌ మూడో వికెట్‌కు అజేయంగా 115 పరుగులు జోడించారు. అనంతరం విండీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 111 పరుగులు చేయగలిగింది. షెమైన్‌ క్యాంప్‌బెల్‌ (47; 57 బంతుల్లో 5×4, 1×6), కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ (34 నాటౌట్‌; 29 బంతుల్లో 5×4) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (2/29), రాజేశ్వరి గైక్వాడ్‌ (1/16), రాధ యాదవ్‌ (1/10) ఆకట్టుకున్నారు. తొలి మ్యాచ్‌లో భారత్‌.. దక్షిణాఫ్రికాపై నెగ్గింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని